1 00:01:08,735 --> 00:01:14,032 కిల్కెన్నీ, ఐర్లాండ్ -1650 2 00:01:32,092 --> 00:01:32,968 ఏంటి? 3 00:01:35,721 --> 00:01:36,889 తోడేలు! 4 00:01:36,972 --> 00:01:38,932 -నా దారికి పక్కకు తప్పుకో! -పద! 5 00:01:39,016 --> 00:01:40,017 దేవూడా, మమ్మల్ని కాపాడు. 6 00:01:43,353 --> 00:01:46,148 దగ్గరకు రాకండి. దగ్గరకు రాకండి! 7 00:02:11,715 --> 00:02:13,926 జగన్మాతా, నువ్వే కాపాడావు తల్లీ. 8 00:02:20,224 --> 00:02:21,099 దేవుడా! 9 00:02:22,434 --> 00:02:23,477 వద్దు! 10 00:02:43,330 --> 00:02:45,207 నువ్వు నరతోడేలువా? 11 00:02:46,458 --> 00:02:47,459 ధన్యవాదాలు. 12 00:03:04,601 --> 00:03:06,728 చచ్చిన తోడేలుకు బహుమానం 13 00:03:58,530 --> 00:04:02,826 తోడేలును చంపేయండి ఎక్కడున్నా వాటిని వేటాడండి 14 00:04:02,910 --> 00:04:07,706 తోడేలును చంపేయండి తోడేళ్లనేవే లేకుండా చేయండి 15 00:04:10,792 --> 00:04:13,629 చూశావా, మెర్లిన్? సరిగ్గా గురి చూసి ఎలా కొట్టానో. 16 00:04:17,382 --> 00:04:19,635 నువ్వేమంటున్నావు? నేను దాని ముక్కుకే గురిపెట్టి కొట్టాను. 17 00:04:20,177 --> 00:04:21,720 నువ్వు ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది. 18 00:04:21,803 --> 00:04:23,055 రాబిన్. 19 00:04:23,138 --> 00:04:24,389 చెప్పు, నాన్నా? 20 00:04:25,432 --> 00:04:27,851 నీ పనులలో నీకు తీరిక లేదనుకుంటా? 21 00:04:27,935 --> 00:04:28,936 అవును, నాన్నా. 22 00:04:29,436 --> 00:04:30,562 దాదాపుగా అయిపోవచ్చిందిలే. 23 00:04:30,646 --> 00:04:32,439 చూస్తుంటే, నువ్వు ఖాళీగా ఉన్నట్టు అనిపించడం లేదు. 24 00:04:32,523 --> 00:04:33,982 ఖాళీగానా, లేదు. 25 00:04:34,775 --> 00:04:37,402 నేను ఇల్లు ఊడ్చాను, దుమ్ము దులిపాను, తడిగుడ్డ కూడా పెట్టాను. 26 00:04:37,486 --> 00:04:39,154 అయినా కానీ పని మాత్రం తగ్గడం లేదు. 27 00:04:43,909 --> 00:04:46,954 ఆ తోడేలు చిత్రం ఎంత దూరం ఉంటుందో. పదిహేను అడుగులు ఉంటుందా? 28 00:04:47,037 --> 00:04:48,622 కానే కాదు. కనీసం ఇరవై అడుగులు ఉంటుంది. 29 00:04:49,206 --> 00:04:51,041 నాకు అంత ఖచ్చితంగా తెలీదు. 30 00:04:51,124 --> 00:04:53,794 దాన్ని నేనంతగా పట్టించుకోలేదు. తుడవడంతోనే నాకు సరిపోతుంది. 31 00:04:54,294 --> 00:04:59,007 రాబిన్, ఇది మన కొత్త ఇల్లు. నువ్వు ఇప్పుడు బక్కెట్ ను, బ్రష్ ను వాడాలి, దీన్ని కాదు. 32 00:04:59,424 --> 00:05:01,677 అబ్బా. రోజంతా ఇక్కడే ఉండటం పరమ బోరింగ్ గా ఉంది. 33 00:05:01,760 --> 00:05:05,180 మనం ఇంగ్లాండ్ లో చేసినట్టుగా, నాక్కూడా నీతో పాటు బయట సాహసాలు చేయాలనుంది. 34 00:05:05,722 --> 00:05:08,892 బంగారం, జమీందారు గారి నియమాలు చాలా కఠినమైనవి. 35 00:05:08,976 --> 00:05:11,311 గోడలు దాటి పిల్లలెవ్వరూ వెళ్ళకూడదు, అది నీకు తెలుసు కదా. 36 00:05:11,395 --> 00:05:13,730 అడవి నిండా నిజమైన తోడేళ్లు ఉన్నాయి, 37 00:05:13,814 --> 00:05:16,024 వాటిని వేటాడాల్సిన బాధ్యత నాది, నీది కాదు. 38 00:05:16,108 --> 00:05:17,317 నాకు తోడేళ్ళంటే భయం లేదు. 39 00:05:17,401 --> 00:05:18,861 నువ్వు ఇంతవరకు ఒక్క తోడేలును కూడా చూడలేదు. 40 00:05:18,944 --> 00:05:20,237 అయినా కానీ నాకు భయం లేదు. 41 00:05:20,320 --> 00:05:22,656 అవును, అందుకే నువ్వు ఏం చేస్తావా అని నాకు భయం వేస్తుంది. 42 00:05:29,121 --> 00:05:30,789 అయితే, నేను నీతో పాటు ద్వారాల దాకా వస్తాను. 43 00:05:30,873 --> 00:05:32,583 సూర్యాస్తమయంలోపు వచ్చేస్తాను. 44 00:05:32,666 --> 00:05:33,959 ఇంట్లోనే ఉండు. 45 00:05:41,884 --> 00:05:44,052 ఇక మన నిఘా పనిని సాధన చేయాలి, మెర్లిన్. 46 00:05:44,136 --> 00:05:45,137 అవును, ఇప్పుడే. 47 00:05:53,645 --> 00:05:54,771 బజ్జీలు ఇక్కడ! 48 00:05:54,855 --> 00:05:56,523 నువ్వు అతడిని కనిపెట్టు, నెను వెనకే వస్తాను. 49 00:06:13,540 --> 00:06:15,417 చేపలు! తాజా చేపలు! 50 00:06:17,336 --> 00:06:18,504 అదరగొట్టేశావు, మెర్లిన్. 51 00:06:20,130 --> 00:06:24,176 తోడేలు ఊళపెడుతుంది అది మనకు వినబడుతుంది 52 00:06:24,259 --> 00:06:28,222 మనం తోడేలు మీద దాడి చేస్తాము అది పారిపోతుంది 53 00:06:28,305 --> 00:06:32,226 తోడేళు ఊళపెడుతుంది తోడేళు ఊళపెడుతుంది 54 00:06:32,309 --> 00:06:34,019 తోడేలు పారిపోతుంది 55 00:06:34,102 --> 00:06:38,440 రకరకాల గవ్వలు, గుల్లలు, శంఖు గవ్వలను కొనుక్కోండి. 56 00:06:38,524 --> 00:06:40,734 గాడిద పాలతో దాన్ని మింగేయి! 57 00:06:40,817 --> 00:06:41,944 అబ్బా. ఛీ. 58 00:06:42,027 --> 00:06:44,029 -రెండే అనా పైసలు. -అతను ఏమైపోయాడు? 59 00:06:44,780 --> 00:06:47,449 పక్కకు తప్పుకోండి. మన్నించండి. దారి ఇవ్వండి. 60 00:06:47,533 --> 00:06:49,076 తోడేలు, తోడేలు 61 00:06:49,159 --> 00:06:53,080 మనం తోడేలు మీద దాడి చేస్తాము అది పారిపోతుంది 62 00:06:54,623 --> 00:06:55,916 రాబిన్. 63 00:06:56,792 --> 00:06:58,752 నేను నిన్ను ద్వారాల దాకా మాత్రమే అనుసరిస్తున్నాను. 64 00:06:58,836 --> 00:07:00,420 నిజంగానా? మరి ఆ తర్వాత? 65 00:07:00,504 --> 00:07:03,131 నాతో పాటు ద్వారాలను దాటి వచ్చి, తోడేళ్ల సమూహాన్ని ఒంటి చేత్తో నరికేసేదానివా? 66 00:07:03,215 --> 00:07:04,883 అవును, కానీ మనమందరం కలిసి కూడా వేటాడవచ్చు. 67 00:07:04,967 --> 00:07:07,052 తోడేళ్లు, ఎలుగుబంట్లు, డ్రాగన్లను కూడా! 68 00:07:07,886 --> 00:07:09,388 నీతో నేనెలా వేగాలి? 69 00:07:11,974 --> 00:07:15,477 మనం కొండలు ఎక్కి, భారీకాయులను చూడవచ్చు, మాంత్రికులను కలవవచ్చు, 70 00:07:15,561 --> 00:07:17,563 జలకన్యలను, నాగినీలను కనుక్కోవచ్చు. 71 00:07:18,438 --> 00:07:21,066 బంగారం, నువ్వూ నీ కల్పిత కథలు. 72 00:07:21,650 --> 00:07:24,570 తోడేలు ఊళ మనకు వినబడుతుంది 73 00:07:24,653 --> 00:07:27,614 తోడేలు ఊళ పెడుతుంది మనం తోడేళ్ల మీద... 74 00:07:27,698 --> 00:07:29,157 తోడేలు ఊళపెడుతుంది 75 00:07:29,825 --> 00:07:31,201 గుడ్ఫెలో! 76 00:07:31,285 --> 00:07:33,871 -సైనికులు! పరిగెత్తండి! -గుడ్ఫెలో! ఒక్క నిమిషం, ఇటు రా! 77 00:07:33,954 --> 00:07:35,998 అలాగే, సర్! ఇక్కడే ఉండు, బంగారం. 78 00:07:36,081 --> 00:07:40,419 తోడేలును కాల్చిపారేయండి! తోడేలును వేటాడండి! 79 00:07:40,502 --> 00:07:44,298 తోడేలును పట్టుకోండి! తోడేలును చంపేయండి! 80 00:07:44,381 --> 00:07:48,468 తోడేలును కాల్చిపారేయండి! తోడేలును వేటాడండి! 81 00:07:48,552 --> 00:07:51,471 -తోడేలును పట్టుకోండి! -దొరికేశావు, తోడేలు. 82 00:07:51,555 --> 00:07:54,474 తోడేలును చంపేయండి! తోడేలును కాల్చిపారేయండి! 83 00:07:56,268 --> 00:08:00,355 హేయ్, ఇంగ్లీష్ అమ్మాయి. ఆ వేషం వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? 84 00:08:00,439 --> 00:08:01,815 నేను వేటగత్తెని. 85 00:08:01,899 --> 00:08:03,483 "నేను వేటగత్తెని." 86 00:08:03,567 --> 00:08:06,236 తన యాస ఎలా ఉందో విన్నారా? 87 00:08:06,320 --> 00:08:09,698 నేనో వేటగత్తెని. మా నాన్న లాగానే. అతడిని మించిన వేటగాడు ఎవ్వరూ లేరు. 88 00:08:09,781 --> 00:08:12,701 కానీ కాదు. అతని కన్నా మా నాన్న గొప్ప వేటగాడు. 89 00:08:12,784 --> 00:08:15,746 అవునా? మేము జమీందారు కోసం తోడేళ్లను వేటాడుతున్నాం. 90 00:08:15,829 --> 00:08:18,707 జమీందారు మా నాన్నను అకారణంగా బంధించారు. 91 00:08:18,790 --> 00:08:21,251 మీ ఇంగ్లీష్ వారు మిమ్మల్ని మీరు గొప్ప అనుకుంటారు, కానీ అది నిజం కాదు. 92 00:08:21,335 --> 00:08:23,086 మీరందరూ మీ ఊరికి వెళ్లిపోవాలి. 93 00:08:23,170 --> 00:08:24,755 కానీ ముందుగా, నువ్వు నీ క్రాస్ బో ఇవ్వు. 94 00:08:24,838 --> 00:08:25,964 ఇవ్వను! 95 00:08:27,674 --> 00:08:30,219 -దీనికి మూల్యం చెల్లించాలి, ఇంగ్లీష్ పాపా. -తను అతడిని నెట్టింది! 96 00:08:30,302 --> 00:08:32,221 నువ్వు అయిపోయావుపో! 97 00:08:36,140 --> 00:08:38,852 -ఏం జరుగుతోంది ఇక్కడ? -సైనికుడు! పారిపోండి! 98 00:08:52,032 --> 00:08:53,909 ఎందుకలా తిరుగుతున్నావు, రాబిన్? 99 00:08:53,992 --> 00:08:56,119 నీకు సాయపడదామనుకున్నా, ఇంతలో ఒక అబ్బాయి ఎదురయ్యాడు, 100 00:08:56,203 --> 00:08:57,579 నీ కన్నా వాళ్ల నాన్నే గొప్ప అని అన్నాడు, 101 00:08:57,663 --> 00:09:00,040 -ఆ తర్వాత నా క్రాస్ బో తీసుకోబోయాడు, ఇక... -రాబిన్! 102 00:09:00,123 --> 00:09:03,001 మనమంటే ఇక్కడ ఎవ్వరికీ అంతగా ఇష్టం లేదు. 103 00:09:03,085 --> 00:09:07,005 నేను పని మీద బయటకెళ్లినప్పుడు నువ్వింట్లో ఉండటమే మంచిది. ఇక్కడే నీకు సురక్షితం. 104 00:09:07,089 --> 00:09:08,715 కానీ నీతో ఉంటే నేను బయట కూడా అంతే సురక్షితంగా ఉంటా. 105 00:09:08,799 --> 00:09:10,801 లేదు, రాబిన్! నువ్వు ఇంట్లోనే ఉండు! 106 00:09:10,884 --> 00:09:12,010 చెప్పినమాట విను. 107 00:09:13,554 --> 00:09:15,180 ఇది నీ మంచి కోసమే, రాబిన్. 108 00:09:16,598 --> 00:09:17,599 చూడు... 109 00:09:18,642 --> 00:09:21,979 ఈ సాయంత్రం, నేను తిరిగొచ్చాక, నువ్వు నాకు కొత్త బాణాలు చేయడంలో సాయపడవచ్చు. సరేనా? 110 00:09:23,105 --> 00:09:26,859 నీ భారీకాయులు, డ్రాగన్ల కథలు నాకు చెప్పు. ఏమంటావు? 111 00:09:26,942 --> 00:09:28,110 సరే అని అంటాను. 112 00:09:28,193 --> 00:09:29,611 ఇక, బుద్ధిగా ఉండు. 113 00:09:38,537 --> 00:09:41,582 గోడలు దాటి పిల్లలు వెళ్లకూడదు. అది జమీందారు గారి ఆదేశం. 114 00:09:46,545 --> 00:09:50,048 నేనెంత పనిమంతురాలినో, ఎంత బాగా వేటాడగలనో ఆయన చూస్తే, 115 00:09:50,132 --> 00:09:52,050 నన్ను కూడా అతనితో పాటు తీసుకెళ్లక తప్పదు. 116 00:09:52,801 --> 00:09:55,387 నువ్వెవరివి మెర్లిన్? కోడివా, గద్ధవా? 117 00:09:59,391 --> 00:10:01,268 తోడేలును చంపండి! చంపండి! 118 00:10:01,351 --> 00:10:03,187 నన్ను ఒంటరిగా వదిలేయండి! 119 00:10:03,270 --> 00:10:04,646 నా మానాన నన్ను వదిలేయండి! 120 00:10:07,524 --> 00:10:09,109 ఇప్పుడు నువ్వు దొరికేశావు, తోడేలు! 121 00:10:11,737 --> 00:10:14,156 పిల్లలూ, మనకు జెండా దొరికింది! రండి! 122 00:10:14,656 --> 00:10:16,867 జమీందారు దిగిపోవాలి! 123 00:10:18,160 --> 00:10:20,829 -ఇక మీ చేష్టలు ఆపండి! -ఇక్కడి నుండి వెళ్లిపోండి! 124 00:10:20,913 --> 00:10:23,123 -ఆ జెండాను ఇవ్వండి! -త్వరగా వెళ్లిపోండి! 125 00:10:25,042 --> 00:10:26,752 అదరగొట్టండి, పిల్ల విప్లవకారులారా! 126 00:10:27,878 --> 00:10:30,464 మంచి పని చేశారు, అబ్బాయిలు! పరిగెత్తండి! పరిగెత్తండి! 127 00:11:39,741 --> 00:11:41,034 అవును, నాకు కూడా కనబడింది. 128 00:11:43,871 --> 00:11:45,122 నేను దానిలో అడుగువేయనులే. 129 00:12:05,225 --> 00:12:10,397 కాపాడండి! తోడేలు! కాపాడండి! 130 00:12:10,480 --> 00:12:11,523 తోడేలా? 131 00:12:11,607 --> 00:12:15,068 తోడేలు! మెర్లిన్, త్వరగా, ఎగురు. ఆ తోడేలు ఎక్కడుందో కనిపెట్టు. 132 00:12:22,201 --> 00:12:23,827 తోడేలు! 133 00:12:23,911 --> 00:12:25,287 -పరిగెత్తండి! -వెనక్కి వచ్చేయండి! 134 00:12:25,370 --> 00:12:27,289 పరిగెత్తండి! 135 00:12:28,874 --> 00:12:30,000 తోడేళ్లు! 136 00:12:39,176 --> 00:12:40,594 దూరంగా వెళ్లు! దగ్గరకు రాకు! 137 00:12:42,095 --> 00:12:43,180 కాపాడండి! 138 00:12:45,682 --> 00:12:47,768 దగ్గరకు రాకు! దగ్గరకు రాకు! 139 00:12:49,353 --> 00:12:51,855 వదులు! త్వరగా, బాణం వదులు! 140 00:13:05,202 --> 00:13:06,203 మెర్లిన్! 141 00:13:29,434 --> 00:13:30,435 ఏంటి? 142 00:13:34,314 --> 00:13:36,483 వద్దు! అది నా పక్షి! దాన్ని వదిలేయి! 143 00:13:38,443 --> 00:13:39,486 ఆగు! 144 00:13:53,000 --> 00:13:54,251 రాబిన్! 145 00:13:59,548 --> 00:14:01,925 -రాబిన్! -మెర్లిన్, అది చచ్చిపోయింది! 146 00:14:02,009 --> 00:14:04,469 -మనం దాన్ని తెచ్చుకోవాలి. -నిన్ను బతికుండగానే తినేసి ఉండేవి. 147 00:14:04,553 --> 00:14:06,680 నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? 148 00:14:06,763 --> 00:14:08,682 -నీకు సాయపడటానికి ప్రయత్నిస్తున్నాను. -నాకు సాయమా? 149 00:14:08,765 --> 00:14:11,852 నువ్వు ఇక్కడికి రాకూడదని నీకు చెప్పాను! ఇందుకే! 150 00:14:11,935 --> 00:14:14,771 -నాన్నా, అవి మెర్లిన్ ని తీసుకెళ్లిపోయాయి. -బంగారం, వద్దు. 151 00:14:15,314 --> 00:14:17,191 నువ్వు ఇప్పుడు దాని కోసం ఆ లోపలికి అస్సలు వెళ్లకూడదు. 152 00:14:17,274 --> 00:14:18,442 కానీ మనం దాన్ని వదిలేయలేము. 153 00:14:18,525 --> 00:14:22,070 చూడు, నీకు ఏమీ కాకుండా చూసుకుంటానని నేను మీ అమ్మకి మాట ఇచ్చాను. 154 00:14:26,825 --> 00:14:28,076 ఏమి కాదులే, బంగారం. 155 00:14:29,536 --> 00:14:31,997 నీకు ఊరిలో ఉండటమే క్షేమం. పద. 156 00:14:34,583 --> 00:14:35,918 అది నీ మంచి కోసమే. 157 00:14:51,517 --> 00:14:54,520 దేవుడా, నీకు చాలా అదృష్టం ఉంది. 158 00:14:54,603 --> 00:14:57,356 నువ్వు గమనించలేదా? అది నరతోడేలు, అయ్య బాబోయ్! 159 00:14:57,439 --> 00:14:58,607 ఇప్పుడు కాస్త శాంతిస్తావా. 160 00:14:58,690 --> 00:15:00,817 వాటి అడవులను కొట్టేయకూడదని అందరికీ తెలుసు. 161 00:15:00,901 --> 00:15:02,903 వాటిని కొట్టేస్తే, అవి మీ పని పడతాయి. అదే కదా అంగీకారం. 162 00:15:02,986 --> 00:15:04,488 అంగీకారమంటూ ఎవ్వరితో ఏమీ లేదు. 163 00:15:04,571 --> 00:15:09,451 సేయింట్ పాట్రిక్, ఆ అంగీకారాన్ని పాత పాగన్లతో చేసుకున్నాడురా, వెధవల్లారా! 164 00:15:09,535 --> 00:15:11,328 -మేము అడవులను నరికివేయవలసిన అవసరం ఉంది. -నువ్వు గమనించలేదా? 165 00:15:11,411 --> 00:15:13,121 నిజానికి, తోడేలు దాడి చేసింది నేనూ చూశాను. 166 00:15:13,205 --> 00:15:16,083 తోడేళ్లన్నీ ఆమె పిలుపుకు ప్రతిస్పందించిన విధానం. 167 00:15:16,166 --> 00:15:19,378 ఆ అడవిలో తోడేళ్లు అడుగడుగునా ఉన్నాయి. 168 00:15:19,461 --> 00:15:21,088 తోడేళ్లనన్నింటినీ తుదముట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. 169 00:15:21,171 --> 00:15:24,800 అవి ఆకలితో ఊరిలోకి అడుగుపెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. 170 00:15:24,883 --> 00:15:28,011 లేదు. మేము ఈ భూములని అదుపులోకి తెస్తాం. జమీందారు గారి ఆదేశం అదే. 171 00:15:28,095 --> 00:15:31,932 జమీందారు మహాత్ముడు. 172 00:15:32,015 --> 00:15:35,561 మాట మీద నిలబడే వాడని అతనికి పేరు ఉందిలే. హాస్యాస్పదంగా ఉంది. 173 00:15:35,644 --> 00:15:37,938 కనీసం పాత రాజు అయినా మమ్మల్ని భద్రంగా ఉంచాడు. 174 00:15:38,021 --> 00:15:41,567 ఆ జమీందారుకు అదృష్టం కలిసొచ్చింది, అంతే. 175 00:15:41,650 --> 00:15:44,403 జమీందారు. 176 00:15:44,486 --> 00:15:45,904 ఆయన దేన్ని పరిరక్షిస్తాడు? 177 00:15:45,988 --> 00:15:47,155 ఇక్కడికి రా! 178 00:15:47,239 --> 00:15:50,951 నీకు ఏవైనా సమస్యలు ఉంటే, నువ్వు నేరుగా నాతోనే మాట్లాడాలి. 179 00:15:51,034 --> 00:15:52,077 మీరేం చేస్తున్నారు? వద్దు! 180 00:15:52,160 --> 00:15:54,997 -మీ చేతులని... -కదలవద్దు! 181 00:15:55,080 --> 00:15:58,125 -వామ్మోయ్. ఇదో జోకులా ఉంది. -లోపలికి పద. 182 00:15:58,208 --> 00:16:00,711 నన్ను వదిలిపెట్టండి! 183 00:16:00,794 --> 00:16:03,922 నేను ఏ తప్పూ చేయలేదు! 184 00:16:04,006 --> 00:16:06,175 దేవుడా! సైతాను నిన్ను చంపేస్తే బాగుంటుంది! 185 00:16:06,258 --> 00:16:09,344 -మరో తోడేలు దాడి జరిగిందా? -అవును, అయ్యా. 186 00:16:09,428 --> 00:16:13,140 ఇలాంటి వాళ్లు ఇంకొందరు తయారైతే, మనం మరో తిరుగుబాటును ఎదుర్కోవలసి వస్తుంది. 187 00:16:13,223 --> 00:16:17,728 మనం చెట్లను నరికివేయకపోతే, రైతులు పొలం పనులు చేసుకోలేరు, 188 00:16:17,811 --> 00:16:21,398 ఈ తోడేళ్లు ఉన్నంత కాలం, ఈ వడ్రంగులు చెట్లను నరకరు. 189 00:16:21,481 --> 00:16:23,525 -ఇది ఆమోదయోగ్యం కాదు. -సరే, అయ్యా. 190 00:16:23,609 --> 00:16:26,778 తోడేళ్ల వల్ల భయపడాల్సింది ఏమీ లేదని మనం వాళ్లకి చూపించాలి. 191 00:16:26,862 --> 00:16:29,281 అవి కేవలం మృగాలు, అంతే. వాటిని అంతమొందించు. 192 00:16:29,364 --> 00:16:30,365 అలాగే, అయ్యా. 193 00:16:33,702 --> 00:16:36,538 తను మీ పాప కదా? 194 00:16:36,622 --> 00:16:39,208 అవును, అయ్యా. రాబిన్. 195 00:16:39,291 --> 00:16:43,504 గోడలను దాటి పిల్లలు వెళ్లడం నిషిద్ధం. తను వంటశాలలో ఎందుకు లేదు? 196 00:16:43,587 --> 00:16:45,422 అయ్యా, తను అక్కడ పని చేయడం లేదు. 197 00:16:45,506 --> 00:16:48,884 మీరు! ఈ అమ్మాయిని వంటశాలలో చేర్చండి. 198 00:16:48,967 --> 00:16:49,968 నాన్నా. 199 00:16:50,052 --> 00:16:52,095 బంగారం, జమీందారు చెప్పినట్టు నడుచుకో. 200 00:16:57,893 --> 00:17:00,687 దక్షిణ భాగాన జరుగుతున్న తిరుగుబాటు సంగతి చూడటానికి నేను వెళ్తున్నాను. 201 00:17:00,771 --> 00:17:04,733 నేను తిరిగొచ్చేసరికి, అడవిలో ఒక్క తోడేలు కూడా ఉండకూడదు. 202 00:17:04,816 --> 00:17:07,778 -అలాగే, అయ్యా. -గుడ్ఫెలో, నీకు రెండు రోజుల సమయం ఉంది. 203 00:17:08,319 --> 00:17:09,613 వాటిని వృధా చేసుకోకు. 204 00:17:25,295 --> 00:17:26,922 ఓయ్, పాపా. 205 00:17:27,005 --> 00:17:30,217 నీ పక్షిని ఎత్తుకెళ్లినదాన్ని నేను ఇంతకుముందు చూశాను. 206 00:17:30,300 --> 00:17:32,553 చాలా రోజుల క్రిందట, తన అమ్మతో ఉండగా చూశాను. 207 00:17:32,636 --> 00:17:36,807 నా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా, తను ఒక నరతోడేలు. 208 00:17:36,890 --> 00:17:38,433 నరతోడేలా? 209 00:17:38,517 --> 00:17:40,686 అవును, నరతోడేలు. 210 00:17:40,769 --> 00:17:45,774 అవి తోడేళ్లతో మాట్లాడగలవు. వాళ్ళు నయం కూడా చేయగలరు. 211 00:17:45,858 --> 00:17:49,069 తన అమ్మ, ఒక చిత్రమైన మంత్ర శక్తితో నాకు నయం చేసింది. 212 00:17:49,152 --> 00:17:52,823 బహుశా తను నీ పక్షికి నయం చేయగలదేమో. బహుశా దాన్ని తినేస్తుందేమో. 213 00:17:52,906 --> 00:17:56,201 -నాకు ఖచ్చితంగా తెలీదు. -నేను తిరిగి అక్కడికి వెళ్లాలి. 214 00:17:56,285 --> 00:17:59,788 మనిద్దరం ఆ గోడలను దాటి వెళ్లాక, ఇంకెక్కడికీ వెళ్లలేము. 215 00:18:03,625 --> 00:18:05,252 నువ్వొక రహస్యాన్ని దాచగలవా? 216 00:18:08,463 --> 00:18:09,798 నా గొర్రెలు. 217 00:18:11,383 --> 00:18:13,844 బాబులూ, మీరు ఆ ద్వారానికి సరిగ్గా తాళం వేయనే లేదు. 218 00:18:13,927 --> 00:18:15,137 ఆ గొర్రెలను వదిలింది నువ్వే కదా? 219 00:18:15,220 --> 00:18:18,974 అవును మరి. దానికి కూడా నన్నే నిందించండి. ఎక్కడ ఏం జరిగినా, అది షాన్ ఓగ్ పనే! 220 00:18:19,057 --> 00:18:20,726 ఇక బండి ఎక్కు. 221 00:18:20,809 --> 00:18:22,769 నాకు నా కాళ్లని చాచాలని ఉంది. 222 00:18:24,688 --> 00:18:26,857 -నా గొర్రెలను పట్టుకోవడంలో సాయపడండిరా! -నేను వాటికి బయటకు దారిని చూపుతాను! 223 00:18:26,940 --> 00:18:28,734 ఓయ్! అతడిని పట్టుకో! 224 00:18:29,568 --> 00:18:32,571 నీ పేరేంటో తెలీదు కానీ, వచ్చి బండి ఎక్కు! 225 00:18:32,654 --> 00:18:33,906 ఆ గొర్రెలని పట్టుకోండి. 226 00:18:33,989 --> 00:18:35,949 నన్ను వదలండి! మీకు బుద్ధి లేదా? 227 00:18:36,700 --> 00:18:38,202 బోనులోకి ఎక్కు! 228 00:18:38,285 --> 00:18:39,870 ఈ పనికి నీకు ఈ సంకెళ్లు మరో వారం అదనంగా ఉంటాయి. 229 00:18:39,953 --> 00:18:41,747 -అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయింది? -నాకు కనబడటం లేదు. 230 00:18:41,830 --> 00:18:43,123 బహుశా అడవులలోకి వెళ్లిందేమో. 231 00:18:43,207 --> 00:18:46,627 మీరిద్దరూ, ఆమ్మాయి కోసం వెతకండి. తను అడవులలోకి వెళ్లిపోయింది. 232 00:18:46,710 --> 00:18:49,963 తనను పట్టుకొని, కోటలోకి తీసుకురండి. అది జమీందారు గారి ఆదేశం. 233 00:18:50,047 --> 00:18:51,548 -అలాగే సర్. -సైతాను మీ... 234 00:18:53,091 --> 00:18:57,095 ఇంగ్లీష్ సైనికులు. వాళ్ల గురించి వాళ్లేం అనుకుంటున్నారు? మనకి ఆదేశాలిస్తున్నారు. 235 00:18:57,179 --> 00:18:59,014 -ఏమన్నావు? -ఏమీ లేదు! 236 00:18:59,097 --> 00:19:00,224 త్వరపడండి! 237 00:19:00,307 --> 00:19:01,350 అలాగే, సర్! 238 00:19:08,106 --> 00:19:11,151 మెర్లిన్? మెర్లిన్! 239 00:19:13,403 --> 00:19:15,489 తోడేలును చంపేయండి 240 00:19:15,572 --> 00:19:18,325 ఎక్కడున్నా వాటిని వేటాడండి 241 00:19:18,408 --> 00:19:20,702 తోడేలును చంపేయండి 242 00:19:21,411 --> 00:19:24,039 తోడేళ్లనేవే లేకుండా చేయండి 243 00:19:39,805 --> 00:19:41,014 మెర్లిన్? 244 00:19:43,767 --> 00:19:44,810 మెర్లిన్! 245 00:19:47,938 --> 00:19:49,022 మెర్లిన్! 246 00:19:50,107 --> 00:19:53,527 బాగున్నావు. కొత్తగా ఉన్నట్టు మెరిసిపోతున్నావే? అదెలా సాధ్యమైంది? 247 00:19:54,278 --> 00:19:55,946 నీకేమీ కానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 248 00:19:56,029 --> 00:19:59,491 నీ రెక్కను ఎలా నయం చేశారు? అది ఆ అమ్మాయి పనే కదా? 249 00:20:00,284 --> 00:20:03,704 తనేం చేసింది? నిన్ను తినేస్తుందేమో అని భయపడిపోయాను. 250 00:20:13,422 --> 00:20:16,091 దగ్గరికి రావద్దు! రావద్దు! బాణం వదులుతా! 251 00:20:16,175 --> 00:20:18,343 మెర్లిన్. మెర్లిన్, ఏం చేస్తున్నావు? 252 00:20:19,052 --> 00:20:22,014 వెళ్లిపో, తోడేలు! ఒట్టేసి చెప్తున్నా, నేను... 253 00:20:22,681 --> 00:20:26,310 మెర్లిన్, ఆపు! అయ్యో! ఏం... 254 00:20:26,393 --> 00:20:28,562 దగ్గరకు రాకు, తోడేలు. 255 00:20:28,645 --> 00:20:30,689 అయ్యో. దగ్గరకు రాకు. 256 00:20:31,690 --> 00:20:34,776 అయ్యో! బాబోయ్. బాబోయ్. 257 00:20:39,781 --> 00:20:43,660 దగ్గరకు రాకు! నీ భరతం పడతాను! దగ్గరకు రాకు, తోడేలు! 258 00:21:32,751 --> 00:21:33,752 మెర్లిన్? 259 00:21:36,296 --> 00:21:38,298 మెర్లిన్! ఆగు! 260 00:21:38,382 --> 00:21:39,591 మెర్లిన్! 261 00:21:56,149 --> 00:21:57,317 మెర్లిన్! 262 00:22:02,281 --> 00:22:03,282 మెర్లిన్! 263 00:22:41,820 --> 00:22:43,155 బాబోయ్! 264 00:23:38,377 --> 00:23:39,378 మెర్లిన్? 265 00:24:03,277 --> 00:24:04,319 ఏంటి? 266 00:24:36,894 --> 00:24:42,107 నువ్విక బయటకు రావచ్చు. నీ వాసనను మేము పసిగట్టేశాము. కంపు కొడుతున్నావు. 267 00:24:42,191 --> 00:24:44,693 నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. దాగుడు మూతలు మాని బయటకు రా. 268 00:24:44,776 --> 00:24:46,278 చూద్దాం నిన్ను. 269 00:24:51,283 --> 00:24:52,868 నన్ను చంపవద్దు. 270 00:24:52,951 --> 00:24:54,995 నాకు నచ్చింది నేను చేస్తాలే. ఇటు రా. 271 00:24:55,078 --> 00:24:57,247 నువ్వు ఒక... 272 00:24:57,331 --> 00:25:00,959 నరతోడేలుని, అయితే ఏంటి? నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పాలి. 273 00:25:01,043 --> 00:25:02,961 -ఎందుకు? -నీ ప్రాణాన్ని కాపాడినందుకు. 274 00:25:03,045 --> 00:25:04,796 నా ప్రాణాన్ని కాపాడావా? నువ్వు నన్ను కరిచావు! 275 00:25:04,880 --> 00:25:06,882 నువ్వు నా మూతి మీద ఎన్నిసార్లు కొట్టావో లెక్కే లేదు. 276 00:25:06,965 --> 00:25:08,258 నువ్వు నా మీద దాడి చేస్తున్నావు మరి. 277 00:25:08,342 --> 00:25:10,636 నేను ఆ ఉచ్చు నుండి నిన్ను విడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. 278 00:25:10,719 --> 00:25:13,263 ఏది ఏమైనా, నువ్వు నా అడవిలోకి వచ్చావు. 279 00:25:13,347 --> 00:25:15,182 నీ అడవా? ఇది మా అడవి. 280 00:25:15,265 --> 00:25:17,518 మీ తోడేళ్లు, వడ్రంగులు, గొర్రెల మీద దాడి చేస్తున్నాయి. 281 00:25:17,601 --> 00:25:22,064 వాళ్లు ఊరికి దగ్గర్లో ఉండాలి, నువ్వు కూడా అదే చేయాలి, ఊరి పాపా. 282 00:25:22,147 --> 00:25:23,565 ఇప్పుడు మమ్మల్ని నిన్ను చూడనివ్వు. 283 00:25:24,608 --> 00:25:26,735 -నీకేమైనా కనిపిస్తున్నాయా? -అబ్బా! నన్ను వదులు! 284 00:25:26,818 --> 00:25:28,695 -నీకు వాసన ఎలా ఉంది? -అబ్బా! ఆపు! 285 00:25:28,779 --> 00:25:30,906 ఊరి పాపలా ఉన్నావు. ఏమైనా అదనపు బొచ్చు ఉందా? 286 00:25:30,989 --> 00:25:32,741 అబ్బా! అది నా జుట్టు! వదులు! 287 00:25:32,824 --> 00:25:36,662 ఇక, కదలడం మాని, దాన్ని నన్ను నయం చేయనివ్వు, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. 288 00:25:36,745 --> 00:25:37,955 హేయ్, నన్ను వదులు! 289 00:25:38,038 --> 00:25:40,499 నువ్వు కాస్త ఆపుతావా? నన్ను నయం చేయనివ్వు! 290 00:25:41,959 --> 00:25:42,960 సరే. 291 00:25:57,850 --> 00:25:58,851 కానీ ఏం చేశావు? 292 00:26:00,269 --> 00:26:03,272 ఇప్పుడు నయమైపోయింది. గాయమే కానట్టుగా ఉంది. ఇక నువ్వు బయలుదేరవచ్చు. 293 00:26:03,355 --> 00:26:04,565 నువ్వే మెర్లిన్ గాయాన్ని నయం చేశావు. 294 00:26:04,648 --> 00:26:08,485 అవును. నీ పక్షికి, నీకు నయం చేశాను, నీ ప్రాణాన్ని కూడా కాపాడాను. 295 00:26:08,569 --> 00:26:10,612 అదేమీ ఫర్వాలేదులే, ఊరి పాపా. ఇక బై! 296 00:26:10,696 --> 00:26:11,822 ఒక్క నిమిషం. ఆమె ఎవరు? 297 00:26:11,905 --> 00:26:14,741 ఆమె... మీ అమ్మనా? 298 00:26:14,825 --> 00:26:16,994 అబ్బా. నువ్వు త్వరగా వెళ్తే మంచిది, లేకపోతే తోడేళ్లకి ఫలహారం అయిపోతావు. 299 00:26:17,411 --> 00:26:19,162 ఏంటి? కానీ నేను... 300 00:26:19,246 --> 00:26:21,415 అయ్యయ్యో. ఆలస్యమైపోయింది. ఇవి నిన్ను ఆరగించేస్తాయి! 301 00:26:21,498 --> 00:26:22,499 వద్దు! 302 00:26:29,590 --> 00:26:30,841 అయ్యో! 303 00:26:42,269 --> 00:26:45,898 పారిపో, ఊరి పాపా! తోడేళ్లు నీ వెంట పడుతున్నాయి! 304 00:26:45,981 --> 00:26:47,733 మా నుండి తప్పించుకోలేవు, ఊరి పాపా. 305 00:26:48,317 --> 00:26:49,693 నా దగ్గరకు రాకండి. 306 00:26:49,776 --> 00:26:52,279 కానీ నువ్వు చాలా నిదానంగా పరిగెడుతున్నావు. 307 00:26:52,362 --> 00:26:56,241 నీ నీడను చూసే నువ్వు భయపడుతున్నావు. ఒక ఊరి పాపకు తోడేళ్ల గురించి ఏం తెలుస్తుంది? 308 00:26:56,325 --> 00:26:58,368 నీ దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయేంటి? 309 00:26:58,452 --> 00:27:00,704 హేయ్, ఆగు! అవన్నీ వేట కోసం! 310 00:27:00,787 --> 00:27:03,415 వేట కోసమా. నీ లాంటి చిన్న పాప వేటాడగలదా? 311 00:27:03,498 --> 00:27:05,125 నువ్వు కూడా పాపవే కదా. 312 00:27:05,209 --> 00:27:07,377 నేను పాపని కాదు! నరతోడేలుని! 313 00:27:08,545 --> 00:27:09,671 బాబోయ్! 314 00:27:09,755 --> 00:27:11,089 పైకి ఎక్కు! 315 00:27:12,299 --> 00:27:14,801 నేను నిద్రపోయేటప్పుడు, తోడేలు అవుతాను. 316 00:27:14,885 --> 00:27:19,389 మేల్కొన్నప్పుడు, నేను మెబ్ ని! మెబ్ ఓగ్ మాక్టియర! 317 00:27:19,890 --> 00:27:21,183 నీ పేరేంటో చెప్పు. 318 00:27:21,642 --> 00:27:23,101 -రాబిన్. -రాబిన్? 319 00:27:23,894 --> 00:27:27,731 నాకు పక్షులంటే ఇష్టం. వాటిని పట్టుకోవడానికి నేను చాలా ఎత్తులు ఎక్కుతా. 320 00:27:27,814 --> 00:27:30,943 అవి నన్ను ఏమార్చి తప్పించుకోలేవు. అవి ఎంతో సేపు నా నుండి తప్పించుకోలేవు. 321 00:27:40,869 --> 00:27:43,580 మళ్లీ దొరికిపోయావు. పెద్ద వేటగత్తె. 322 00:27:44,665 --> 00:27:47,042 దీనితో నాకు రెండు పాయింట్లు, నీకు సున్నా. 323 00:27:47,125 --> 00:27:48,752 అబ్బా! 324 00:27:49,503 --> 00:27:53,382 అబ్బా. ఇంత చిరాకు తెప్పించవద్దు. ఇదేమీ సరదాగా లేదు. 325 00:27:53,465 --> 00:27:54,842 నన్ను దించు! 326 00:27:54,925 --> 00:27:56,885 అలాగే, ఊరి పాపా. 327 00:27:56,969 --> 00:27:58,637 నువ్వెలా అంటే అలా. 328 00:27:58,720 --> 00:27:59,805 వద్దు, ఆగు! 329 00:28:04,726 --> 00:28:06,478 హేయ్! నన్ను "ఊరి పాప" అని పిలవడం ఆపు. 330 00:28:06,562 --> 00:28:09,898 సరే, రాబిన్. పద ఇంటికి వెళ్దాం. సరదా సమయం అయిపోయింది. 331 00:28:09,982 --> 00:28:13,151 ఏంటంటే, మెబ్ పాపా, నీ ఆలోచన... 332 00:28:13,235 --> 00:28:15,195 -ష్! మీకు అది వినిపించిందా? -ఏది? 333 00:28:15,279 --> 00:28:17,531 ఒక మగవాడు. అతని పని పడతాను. 334 00:28:17,614 --> 00:28:20,242 మగవాడా? అయ్యో, నాన్నా. 335 00:28:31,628 --> 00:28:34,298 ఒక్క ఊరి పిల్లగాడు వచ్చాడు. అతడిని కాస్త భయపెడతాను. 336 00:28:34,381 --> 00:28:35,716 వద్దు. ఆగు. 337 00:29:17,299 --> 00:29:18,842 దాదాపుగా కనిపెట్టేయబోయాడు. 338 00:29:18,926 --> 00:29:23,096 నువ్వెందుకు భయపడుతున్నావు? మా దగ్గర తోడేళ్ల సమూహం ఉంది. 339 00:29:27,059 --> 00:29:28,852 హేయ్, మీకు చెప్పా కదా. 340 00:29:28,936 --> 00:29:34,024 మీరు పగటి వేళ బయటకు వెళ్లకూడదు. అమ్మ అదే చెప్పింది. వెళ్లి పడుకోండి. 341 00:29:34,566 --> 00:29:36,026 ఆ గుహలో ఉండేది మీ అమ్మేనా? 342 00:29:36,109 --> 00:29:38,779 అవును! నాలో తన పోలికలు కనబడటం లేదా? 343 00:29:38,862 --> 00:29:42,616 మిగతా తోడేళ్ళు కూడా, మనుషులు అయిపోతాయా? 344 00:29:42,699 --> 00:29:45,494 లేదు. బాబోయ్! నీకేమైనా పిచ్చా? 345 00:29:45,577 --> 00:29:47,579 నా కుటుంబం ఎంత పెద్దదని అనుకుంటున్నావు? 346 00:29:48,789 --> 00:29:51,667 నేను ఇక్కడ ఉండకూడదు. చూడు, నేను వెళ్లిపోవాలి. 347 00:29:51,750 --> 00:29:54,795 మంచిది, నేను కూడా నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అనుకుంటున్నా. కళ్లు మూయి. 348 00:29:54,878 --> 00:29:55,879 ఏంటి? ఎందుకు? 349 00:29:55,963 --> 00:29:58,799 నువ్వు నా గుహకు మళ్లీ మళ్లీ రాకూడదు. అది రహస్యం. 350 00:30:00,425 --> 00:30:01,593 కానీ అది ఎక్కడుందో నాకు ఇప్పుడు తెలుసు కదా. 351 00:30:01,677 --> 00:30:03,387 నోర్మూసుకొని పద. 352 00:30:03,470 --> 00:30:05,013 నేను మీ ఊరికి దారి చూపుతాను. 353 00:30:05,097 --> 00:30:07,140 లేదు, ముందు నాకు నా క్రాస్ బో కావాలి. 354 00:30:07,224 --> 00:30:09,476 అది ఎందుకు నీకు? మళ్లీ నీ పక్షిని కాల్చడానికా? 355 00:30:09,560 --> 00:30:11,019 లేదు, ఎవరిని కాల్చడానికి అంటే... 356 00:30:11,728 --> 00:30:13,230 వదిలేయిలే. 357 00:30:13,313 --> 00:30:15,649 ఇటు వైపు, వేటగత్తె-ఊరి-రాబిన్-పాప. 358 00:30:20,946 --> 00:30:22,906 హేయ్! అంత వేగంగా తోయకు. 359 00:30:22,990 --> 00:30:24,575 నువ్వు చాడీలను ఆపుతావా? 360 00:30:30,539 --> 00:30:31,540 వాసన తెలుస్తోందా? 361 00:30:32,040 --> 00:30:33,041 మెబ్. 362 00:30:36,295 --> 00:30:38,005 ఊరి నోరూరే వంటకాలు. 363 00:30:38,589 --> 00:30:40,048 "ఊరి నోరూరే వంటకాలు"? 364 00:30:41,758 --> 00:30:44,052 ఏంటి? ఎక్కడికి వెళ్లిపోయింది? 365 00:30:46,680 --> 00:30:48,182 నువ్వు వాళ్లతో ఏం చెప్పావు? 366 00:30:48,265 --> 00:30:50,684 తను ఇంటికే వెళ్లిపోతుంది కదా? అందులో సందేహమే లేదు. 367 00:30:50,767 --> 00:30:54,271 నెడ్, ఒకవేళ తోడేలు ఆమెని కరిచిందనుకో, తను కూడా వారిలాగా అయిపోతుందా? 368 00:30:54,354 --> 00:30:55,189 తోడేలుగానా? 369 00:30:55,272 --> 00:30:59,026 లేదు. సగం-తోడేలు, సగం-మంత్రగత్తె, సగం-మానవులులా అవుతుంది. 370 00:30:59,109 --> 00:31:01,862 నరతోడేళ్లా? ఇక నువ్వు ఆపుతావా? 371 00:31:01,945 --> 00:31:05,115 మనం వాటి అడవులను నరికివేస్తున్నాం, నెడ్. అలా చేయడం మంచి పని కాదు. 372 00:31:05,199 --> 00:31:07,201 ఆ సోది అంతా నాకు చెప్పకు. 373 00:31:07,284 --> 00:31:09,328 షాన్ ఓగ్, ఆ సైనికులు మన చేత చేయిస్తున్నారు. 374 00:31:09,411 --> 00:31:13,749 కానీ ఆ ఐరన్సైడ్ జమీందారు, ఆ తోడేళ్ల సమస్యను పరిష్కరించకపోతే, 375 00:31:13,832 --> 00:31:17,377 ఆయన ఆదేశాలను మనతో పాటు ఇంకా చాలా మంది పట్టించుకోరు. 376 00:31:17,461 --> 00:31:19,588 నేను ఇంకే ఆదేశాలు ఇవ్వను, నెడ్. 377 00:31:19,671 --> 00:31:21,798 ఆ ఊరి వంటకాలు నావి. 378 00:31:21,882 --> 00:31:24,718 నాకు అది అక్కర్లేదు. నాకు కావలసింది నా క్రాస్ బో. 379 00:31:25,385 --> 00:31:28,722 అలాగే. కానీ ఆ ఊరి వంటకాలు నావే. 380 00:31:28,805 --> 00:31:32,809 -మళ్లీ మన ఊరికి తలబిరుసు జమీందారు రాకూడదు. -లేదు, అలా జరగదు, నెడ్. 381 00:31:34,061 --> 00:31:35,604 -ఏంటి? -ఏమైంది, నెడ్? 382 00:31:35,687 --> 00:31:36,813 గాలి అయ్యుంటుందిలే. 383 00:31:38,565 --> 00:31:40,651 హెయ్, ఆలుగడ్డలను ఏం చేశావు? 384 00:31:41,068 --> 00:31:44,196 ఆలుగడ్డలా, నెడ్? బ్రెడ్ కూడా కనబడటం లేదు. 385 00:31:44,279 --> 00:31:46,698 ఆలుగడ్డలు లేవు, బ్రెడ్ కూడా లేదా? 386 00:31:46,782 --> 00:31:49,868 -నా టోపీ. నా టోపీ నాకు ఇచ్చేయ్. -నా బ్రెడ్. అది నాకు ఇచ్చేయ్. 387 00:31:50,577 --> 00:31:52,704 లోపల ఎవరో ఉన్నారు! అయ్యబాబోయ్... 388 00:31:52,788 --> 00:31:54,081 నా పాలు! 389 00:31:54,164 --> 00:31:55,541 ఎవరో నా పాలు ఎత్తుకెళ్లిపోయారు! 390 00:31:55,624 --> 00:31:57,251 పద! పద! 391 00:32:03,465 --> 00:32:04,967 వాళ్లకి ఇంకాస్త ఉంటే దొరికిపోయేవాళ్లం. 392 00:32:07,803 --> 00:32:10,472 నన్నెవ్వరూ పట్టుకోలేరు, ఊరి పాపా. 393 00:32:13,183 --> 00:32:16,645 నువ్వు అసలు అక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? ఆ వాసనలు. 394 00:32:18,272 --> 00:32:19,857 అక్కడ చాలా వాసన వస్తుంది. 395 00:32:20,899 --> 00:32:22,985 నాకు అక్కడే ఉండిపోవాలని లేదు. 396 00:32:23,569 --> 00:32:25,112 నేను ఇంగ్లాండ్ ని మిస్ అవుతున్నాను. 397 00:32:25,195 --> 00:32:27,447 "ఇంగ్లాండ్" అంటే ఏమిటి? 398 00:32:27,531 --> 00:32:28,782 నేను అక్కడే ఉండేదాన్ని. 399 00:32:28,866 --> 00:32:31,952 నేను ఎక్కడికైనా వెళ్లగలిగేదాన్ని, స్నేహితులతో ఆడుకొనేదాన్ని. 400 00:32:32,035 --> 00:32:33,328 అక్కడ చాలా బాగా ఉండింది. 401 00:32:33,412 --> 00:32:35,247 వింటుంటే అదో అడవిలాగా అనిపిస్తోంది. 402 00:32:35,330 --> 00:32:38,959 నేనూ, మెర్లిన్, ఆహారం కోసం వేటాడటంలో మా నాన్నకి సాయపడేవాళ్లం కూడా. 403 00:32:39,042 --> 00:32:41,879 ఇప్పుడు, ఆయన ఎప్పుడూ నన్ను ఊరిలోనే ఉండమంటున్నాడు. 404 00:32:41,962 --> 00:32:44,882 ఇక్కడ అడవిలో ఉండు. చాలా బాగుంటుంది. 405 00:32:45,549 --> 00:32:47,759 -బాగా పరిగెత్తవచ్చు. -ఆడుకోవచ్చు. 406 00:32:47,843 --> 00:32:49,761 తినవచ్చు, అల్లరి చేయవచ్చు, ఎక్కవచ్చు. 407 00:32:50,721 --> 00:32:51,722 స్వేచ్ఛగా ఉండవచ్చు. 408 00:32:54,224 --> 00:32:57,102 లేదు. మా నాన్నను విడిచి నేను రాలేను. 409 00:32:57,561 --> 00:33:00,063 అతను జమీందారు కోసం పని చేయాలి, ఇంకా... 410 00:33:00,939 --> 00:33:04,276 మెబ్, నువ్వు కూడా అడవిలో ఉండకూడదు. వాళ్లు దీన్ని మొత్తం నరికేస్తున్నారు. 411 00:33:04,359 --> 00:33:06,528 అది జరగని పని! నేను వాళ్లని బెదరగొట్టి పంపేస్తాను. 412 00:33:06,612 --> 00:33:10,073 జమీందారుకు తోడేళ్లను చంపేయాలని అనుకుంటున్నాడు! నువ్వు వెళ్లిపోవాలి. 413 00:33:10,157 --> 00:33:13,827 మేము వెళ్లిపోవడానికే ప్రయత్నించాము. నేను, అమ్మా, ఈ సమూహంతో. 414 00:33:13,911 --> 00:33:14,912 మరి ఎందుకని వెళ్లలేకపోయారు? 415 00:33:15,537 --> 00:33:17,539 -అమ్మ వెళ్లిపోయింది. -తోడేలు లాగానా? 416 00:33:17,623 --> 00:33:20,417 అవును, మేము ఉండటానికి ఒక కొత్త ప్రాంతాన్ని చూడటానికి. 417 00:33:20,501 --> 00:33:26,381 అది సన్నాసుల్లేని, ఆహారం ఇబ్బడిముబ్బడిగా దొరికే పెద్ద గుహ అయ్యుంటుంది. 418 00:33:26,465 --> 00:33:29,968 చాలా అద్భుతంగా ఉంటుంది! 419 00:33:30,052 --> 00:33:33,472 మరి, ఆమె ఎక్కడ ఉంది? తనను పట్టేసుకున్నారని అనుకుంటున్నావా? 420 00:33:33,555 --> 00:33:37,059 లేదు. తనకు ఏమీ కాదు. మా అమ్మను ఎవ్వరూ పట్టుకోలేరు. 421 00:33:37,142 --> 00:33:41,939 పొరపాటున ఆ సన్నాసులు మా అమ్మను పట్టుకుంటే, నా తోడేళ్లకు వాళ్ళని ఆహారం చేస్తాను! 422 00:33:42,022 --> 00:33:44,650 అయితే, తన రాక కోసం ఎదురు చూస్తున్నావా? 423 00:33:45,234 --> 00:33:46,276 అవును. 424 00:33:46,985 --> 00:33:52,032 ఈ ప్రపంచంలో మాకు మేమిద్దరమే అన్నమాట, 425 00:33:53,909 --> 00:33:55,202 నేను, మా నాన్నలాగా. 426 00:34:02,167 --> 00:34:03,460 కానీ వాళ్లు గుహను కనిపెట్టేస్తే? 427 00:34:03,544 --> 00:34:05,921 వాళ్ళు కనుక్కోలేరు. ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేదు. 428 00:34:06,004 --> 00:34:07,005 నేను కనిపెట్టా కదా. 429 00:34:07,089 --> 00:34:09,550 అవును. నేనే కనిపెట్టనిచ్చాను కాబట్టి. 430 00:34:26,525 --> 00:34:28,110 నీ గురించి నేను మా నాన్నకు చెప్పాలి. 431 00:34:28,193 --> 00:34:31,196 అతనికి తెలీదు... మాకు తెలీదు అన్నమాట నరతోడేళ్లు నిజంగా ఉంటారని. 432 00:34:34,324 --> 00:34:37,870 మీరు కూడా మనుషులని. నేను ఇక బయలుదేరితే మంచిది. 433 00:34:41,915 --> 00:34:43,375 చూడు, నేను నీకు సాయపడతాను. 434 00:34:43,458 --> 00:34:45,127 రేపు, ఆ పెద్ద వృక్షం దగ్గర నా కోసం ఎదురుచూడు. 435 00:34:45,210 --> 00:34:49,172 నేను నీకు కొంత బ్రెడ్... అదే "ఊరి వంటకాలు" తెస్తాను. 436 00:34:49,255 --> 00:34:52,134 అలాగే. మళ్లీ కలుద్దాం, ఊరి పిల్లా. 437 00:34:52,217 --> 00:34:53,969 ముందు నేనే ఆ పని చేస్తాను. 438 00:35:21,121 --> 00:35:22,998 నువ్వేనా. 439 00:35:24,750 --> 00:35:26,835 అయితే, నిన్ను అవి తినలేదా? అది చాలా మంచి విషయం. 440 00:35:26,919 --> 00:35:29,421 నువ్వన్నది నిజమే. ఆ అమ్మాయి మెర్లిన్ కి నయం చేసింది. 441 00:35:29,505 --> 00:35:32,299 అవునా? నీకు ముందే చెప్పా కదా. 442 00:35:32,382 --> 00:35:33,383 నేను ఇక బయలుదేరితే మంచిది. 443 00:35:33,467 --> 00:35:37,137 అయితే, నాతో కనుక నీకు పని ఉంటే, నేను ఎక్కడ ఉంటానో నీకు తెలుసు కదా. 444 00:35:39,473 --> 00:35:40,474 నాన్నా? 445 00:35:41,767 --> 00:35:42,768 నాన్నా? 446 00:35:43,477 --> 00:35:45,062 నేను అతడిని ఒప్పించాలి. 447 00:35:45,771 --> 00:35:48,273 అతను రాక ముందే మనం ఈ చోటును శుభ్రపరచాలి. 448 00:35:57,324 --> 00:35:59,743 "దేవుడా, రాబిన్, ఈ చోటు తళతళలాడిపోతోంది." 449 00:36:00,619 --> 00:36:03,038 ధన్యవాదాలు, నాన్నా. కూర్చో. కాళ్ళు పైకెత్తు. 450 00:36:03,580 --> 00:36:05,249 "తప్పకుండా, బంగారం." 451 00:36:05,332 --> 00:36:06,500 ఇవాళ వేట కష్టంగా ఉండిందా? 452 00:36:06,583 --> 00:36:09,044 "అవును. ఒక్క తోడేలు కూడా కనబడలేదు." 453 00:36:09,837 --> 00:36:13,131 ఒకవేళ నేను ఆ తోడేళ్ళని అన్నింటినీ వెళ్లిపోయేలా చేసి, 454 00:36:13,215 --> 00:36:14,883 మనం వాటిని అసలు చంపాల్సిన అవసరమే లేకపోతే? 455 00:36:15,384 --> 00:36:17,427 "నువ్వు మళ్లీ నీ కల్పిత గాథలను చెప్తున్నావని అంటాను." 456 00:36:17,511 --> 00:36:20,430 అది కల్పిత కథ కాదు. ముందు నా మీద కోప్పడవని నాకు మాట ఇవ్వు. 457 00:36:20,514 --> 00:36:21,682 "మాట ఇస్తున్నాను." 458 00:36:21,765 --> 00:36:25,269 నేను అడవిలో ఒక అమ్మాయిని కలిశాను, తను మంత్రశక్తితో నయం చేయగలదు. 459 00:36:25,352 --> 00:36:26,562 తను మెర్లిన్ కి నయం చేసింది. 460 00:36:27,729 --> 00:36:29,273 తను నరతోడేలు. 461 00:36:29,857 --> 00:36:31,108 "నరతోడేలా?" 462 00:36:31,525 --> 00:36:34,903 అవును. తను నిద్రపోయేటప్పుడు, తోడేలులా మారిపోతుంది. 463 00:36:34,987 --> 00:36:36,363 తను తోడేళ్లతో మాట్లాడగలదు. 464 00:36:36,446 --> 00:36:38,448 తను, తన అమ్మ, తోడేళ్లను వేరే ప్రాంతానికి తీసుకెళ్లబోయారు, 465 00:36:38,532 --> 00:36:41,535 -కానీ తన అమ్మ తప్పిపోయింది. -"తప్పిపోయిందా? పాపం." 466 00:36:41,618 --> 00:36:44,121 నాకు తెలుసు, కానీ మనం తన అమ్మ జాడ కనిపెట్టడంలో తనకి సాయపడితే, 467 00:36:44,204 --> 00:36:45,956 అప్పుడు వాళ్లందరూ అడవిని వదిలి వెళ్లిపోతారు, 468 00:36:46,039 --> 00:36:48,458 నువ్వు కూడా జమీందారు కోసం నీ విధిని నిర్వర్తించినట్టవుతుంది. 469 00:36:48,542 --> 00:36:51,170 "భలే ఆలోచన, బంగారం. చాలా బాగుంది. 470 00:36:51,253 --> 00:36:52,963 ధన్యవాదాలు. మన సమస్యలు ముగిసిపోయాయి. 471 00:36:53,046 --> 00:36:55,132 మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్లమో ఇకపై అలా ఉండవచ్చు." 472 00:37:00,220 --> 00:37:02,181 తల్లీ, ఇటు రా అమ్మా. 473 00:37:02,764 --> 00:37:06,351 నీకేమీ కాలేదు కదా? ఆ తోడేలు దాడి తర్వాత నీకు ఎలా అనిపించింది? భయపడ్డావా? 474 00:37:06,435 --> 00:37:08,437 నాకెమీ కాలేదు. కూర్చో. కాళ్లు పైకెత్తు. 475 00:37:10,230 --> 00:37:11,273 చక్కగా చేస్తున్నావు. 476 00:37:11,940 --> 00:37:15,277 వంటశాలలో నీ పని ఎలా ఉండింది? అలసిపోయుంటావు, బంగారం. 477 00:37:15,360 --> 00:37:17,529 ఆ విషయం గురించి, నేను నీకొక సంగతి... 478 00:37:17,613 --> 00:37:21,158 మెర్లిన్ కూడా వచ్చేసింది. దేవుడా, ఇది నీకు భలే మంచి రోజులా ఉంది, బంగారం. 479 00:37:21,241 --> 00:37:23,285 అవును, మంచి రోజే. కానీ నేను నీకొక... 480 00:37:23,368 --> 00:37:24,703 కానీ నా రోజే అస్సలేం బాగాలేదు. 481 00:37:24,786 --> 00:37:27,664 ఈ వారంలో నేను పన్నిన ప్రతీ ఉచ్చూ, అయితే విరిగిపోయింది లేదా తెరిచి ఉంది. 482 00:37:27,748 --> 00:37:29,208 ఇలాంటి తోడేళ్లను నేనెన్నడూ చూడలేదు. 483 00:37:29,291 --> 00:37:32,711 నాన్నా, ఈ తోడేళ్లనన్నింటినీ నేను వెళ్లిపోయేలా చేయగలనని, 484 00:37:32,794 --> 00:37:34,630 నువ్వు దేన్నీ చంపాల్సిన పని లేదని చెప్తే, ఏమంటావు? 485 00:37:34,713 --> 00:37:36,924 ఇప్పుడు, నా మీద కోప్పడవని మాట ఇవ్వు. 486 00:37:37,007 --> 00:37:38,008 చెప్పు. 487 00:37:38,467 --> 00:37:39,510 నువ్వు మాటివ్వలేదు. 488 00:37:39,593 --> 00:37:41,303 నాకు తెలుసు. చెప్పు నాకు. 489 00:37:41,845 --> 00:37:45,557 -ఏంటంటే, నేను మెర్లిన్ కోసం వెళ్ళాను... -నువ్వు అడవిలోకి వెళ్ళావా? 490 00:37:45,641 --> 00:37:47,267 నాన్నా, విను. తను కూడా ఆ జాతికి చెందినదే. 491 00:37:47,351 --> 00:37:49,853 నరతోడేలు. ఆ వడ్రంగి చెప్పాడు కదా. అవి నిజంగానే ఉన్నాయి! 492 00:37:49,937 --> 00:37:51,438 -నువ్వు మళ్లీ వెనక్కి వెళ్లావా? -కానీ, నాన్నా... 493 00:37:51,522 --> 00:37:52,523 నువ్వు వంటశాలను విడిచి వెళ్ళావా? 494 00:37:52,606 --> 00:37:54,900 నిజానికి, నేను వంటశాల దాకా వెళ్లలేదు. 495 00:37:54,983 --> 00:37:57,194 ఏంటి? జమీందారు ఆదేశించాడు... 496 00:37:57,277 --> 00:37:58,820 -మనం తన అమ్మని కనిపెట్టగలిగి... -విను! 497 00:37:58,904 --> 00:38:01,448 నువ్వు జమీందారు నియమాలను పాటించాలి. 498 00:38:01,532 --> 00:38:03,867 ఆయన నిన్ను ఆదేశించాడు, కానీ నువ్వు దాన్ని పాటించలేదు. 499 00:38:03,951 --> 00:38:05,619 చెరసాల అంటే నీకు భయం లేదా? 500 00:38:06,453 --> 00:38:09,122 ఈ ఊరిలో ఉండాలంటే మనిద్దరం కలిసికట్టుగా పని చేయాలి, బంగారం. 501 00:38:09,206 --> 00:38:11,083 రేపు, నేనే స్వయంగా నిన్ను వంటశాల వద్ద దిగబెడతాను. 502 00:38:11,166 --> 00:38:13,377 కానీ, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా. 503 00:38:14,044 --> 00:38:15,546 నేను నీకు సాయపడగలను. మనం... 504 00:38:15,629 --> 00:38:20,217 ఈ ఊరిలోనే ఉంటూ, ప్రమాదాలకు దూరంగా ఉంటూ, నీ పని చేసుకుంటూ నాకు సాయపడు చాలు. 505 00:38:20,801 --> 00:38:21,927 ఇప్పుడే నాకు మాట ఇవ్వు. 506 00:38:23,387 --> 00:38:24,429 మాట ఇస్తున్నాను, నాన్నా. 507 00:38:24,972 --> 00:38:26,557 సరే. ఇక వెళ్లి పడుకో. 508 00:38:31,270 --> 00:38:32,938 అమ్మ అయితే నా మాట విని ఉండేది. 509 00:38:34,481 --> 00:38:36,525 తను నీ క్షేమాన్నే కోరుకొనేది, రాబిన్. 510 00:38:37,818 --> 00:38:38,819 మంచిగా నిద్రపో. 511 00:38:45,033 --> 00:38:46,910 తనని కాపాడటానికి మనం ఓ మార్గాన్ని తప్పక కనుగొంటాము, మెర్లిన్. 512 00:39:27,618 --> 00:39:29,828 -రాబిన్? -నాన్నా? 513 00:39:29,912 --> 00:39:32,748 -నీకు ఏమీ కాలేదు కదా? -ఏమీ కాలేదు. 514 00:39:32,831 --> 00:39:34,208 పీడకల, అంతే. 515 00:39:34,291 --> 00:39:38,712 మనం ఉదయాన్నే బయలుదేరాలి. వెళ్దాం పద. 516 00:39:59,650 --> 00:40:02,277 మాతో పని చేయడానికి కొత్త అమ్మాయి వచ్చి చేరినందుకు సంతోషం. 517 00:40:02,361 --> 00:40:03,695 -తన మీద ఓ కన్నేసి ఉంచండి. -అలాగే. 518 00:40:03,779 --> 00:40:05,447 -తను రోజంతా పని చేయాలి. -అలాగే. 519 00:40:05,531 --> 00:40:07,783 -పనిలోనే పరమాత్ముడు ఉంటాడు, రాబిన్. -ఫర్వాలేదులే, పాపా. 520 00:40:07,866 --> 00:40:10,744 నేను ఇక్కడ పని చేయడం ఆరంభించినప్పుడు నా వయస్సు నీలో సగమే ఉండేది. 521 00:40:10,827 --> 00:40:13,288 నీకు చెప్పిన పని చేయి చాలు, అంతా సర్దుకుంటుంది. 522 00:40:14,164 --> 00:40:15,874 ఇది నీ మంచి కోసమే, బంగారం. 523 00:40:48,991 --> 00:40:51,076 పనిలోనే పరమాత్ముడు ఉంటాడు, పాపా. 524 00:40:51,159 --> 00:40:52,870 నువ్వు ఆపకపోతేనే మంచిది. 525 00:41:19,563 --> 00:41:20,772 అయ్యయ్యో. 526 00:41:45,130 --> 00:41:46,507 పాప. 527 00:41:48,550 --> 00:41:51,678 పాప. 528 00:41:55,849 --> 00:41:59,269 పాప. 529 00:42:07,819 --> 00:42:08,820 పాప. 530 00:42:11,198 --> 00:42:12,491 పాప. 531 00:42:12,574 --> 00:42:13,575 పాప! 532 00:42:13,659 --> 00:42:16,411 దేవుడా, భగవంతుడా. ఈ గది నుండి బయటకు పద, అమ్మాయి. 533 00:42:16,495 --> 00:42:19,456 జమీందారు గారు ఈ గదిలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. 534 00:42:19,998 --> 00:42:22,793 ఆయన కాకుండా నేను నిన్ను కనుక్కోవడం నీ అదృష్టం. 535 00:42:22,876 --> 00:42:24,545 నిన్ను చెరసాలలో వేసేవాడు. 536 00:42:24,628 --> 00:42:29,132 జమీందారు గారు, ఆయన నియమాలను పాటించాలని కోరుకుంటాడు. అది రేపు గుర్తుంచుకో. 537 00:42:29,675 --> 00:42:31,385 ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్లిపో. 538 00:42:49,194 --> 00:42:51,780 వచ్చేశావా. 539 00:42:55,242 --> 00:42:56,660 మళ్లీ నీ కొత్త నేస్తాన్ని చూశావా? 540 00:42:56,743 --> 00:42:57,744 రాబిన్! 541 00:42:57,828 --> 00:42:59,955 లోపలికి రా. బయటే ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. 542 00:43:04,084 --> 00:43:07,129 నువ్వు వేటగత్తెవా, లేక పని మనిషివా? 543 00:43:12,718 --> 00:43:13,927 పనిలోనే పరమాత్ముడు ఉంటాడు, రాబిన్. 544 00:43:14,011 --> 00:43:16,221 అయితే ఉన్న పరమాత్ములందరికీ సరిపడేంత పని చేశాను. 545 00:43:16,889 --> 00:43:17,890 మంచి పాపవి. 546 00:43:20,392 --> 00:43:21,810 ఇది నీకు ఇంకా కొత్తదే కావచ్చు, 547 00:43:21,894 --> 00:43:24,104 కానీ ఒక యువతికి ఇదే ఆదర్శమయమైన జీవితం. 548 00:43:24,188 --> 00:43:25,814 నాకు అయితే ఇది అసలు జీవితమే కాదు. 549 00:43:25,898 --> 00:43:28,358 నరతోడేళ్లు వెళ్లిపోయేలా నేను చేయగలను. ముందు నువ్వు నా మాట వినాలి... 550 00:43:28,442 --> 00:43:30,485 రాబిన్ గుడ్ఫెలో, నీ కథలను ఇక కట్టిపెట్టు. 551 00:43:30,569 --> 00:43:31,570 నేను తన కోసం వెతకగలను... 552 00:43:31,653 --> 00:43:34,072 నీకు చెప్పిన పనిని నువ్వు చేయాలి. ఇక చందమామ కథలను ఆపు. 553 00:43:34,156 --> 00:43:35,157 -కానీ... -కానీ లేదు గీనీ లేదు. 554 00:43:35,240 --> 00:43:37,451 -నరతోడేళ్లు... -నరతోడేళ్లు, నిజంగా లేరు. 555 00:43:50,172 --> 00:43:52,549 అవి నిజంగానే ఉన్నాయి కదా, మెర్లిన్? 556 00:44:28,168 --> 00:44:30,462 మెర్లిన్, నీకు ఆ వాసన తెలుస్తోందా? 557 00:44:31,463 --> 00:44:33,090 మెర్లిన్, నీకేమైంది? 558 00:44:34,049 --> 00:44:35,551 నేను నీ వాసనను చూడగలుగుతున్నాను. 559 00:44:38,136 --> 00:44:42,641 ఏంటి? అయ్యయ్యో. అయ్యయ్యో. 560 00:44:45,894 --> 00:44:50,315 ఏంటి? నేనేం చేశాను? అసలు ఇదెలా జరిగింది? అయ్యయ్యో. అయ్యో. 561 00:44:54,194 --> 00:44:56,321 -తోడేలు, తోడేలు! రాబిన్, లేయి! -నాన్నా, నన్ను కాపాడు. 562 00:45:00,617 --> 00:45:02,911 లేదు, లేదు, నాన్నా. నేను! నాన్నా! 563 00:45:18,760 --> 00:45:19,761 ఏంటది? 564 00:45:20,637 --> 00:45:21,972 దాన్ని చూశావా? 565 00:45:41,783 --> 00:45:42,993 మెబ్! 566 00:46:02,721 --> 00:46:03,847 -మెబ్! -రాబిన్! 567 00:46:05,057 --> 00:46:06,225 నాకేదో అయింది. 568 00:46:06,308 --> 00:46:08,018 అవును, తెలుస్తూనే ఉంది. 569 00:46:09,311 --> 00:46:13,023 నా కాటును సరిచేశాననే అనుకున్నాను. నీకేమీ కాదు అనే అనుకున్నాను. 570 00:46:13,106 --> 00:46:15,234 అమ్మ నన్ను చంపేస్తుంది. 571 00:46:15,317 --> 00:46:17,277 మా నాన్న కూడా నన్ను చంపేస్తాడు. 572 00:46:18,820 --> 00:46:21,615 హేయ్! శాంతించి, తనని ఒంటరిగా వదిలేయండి! 573 00:46:22,115 --> 00:46:24,034 ఏది ఏమైనా, అదన్నమాట సంగతి. 574 00:46:24,117 --> 00:46:28,455 నిన్ను ఇలా చూడటం చాలా అద్భుతమైన విషయం. మేమే చివరివాళ్లం అనుకున్నాను. 575 00:46:28,539 --> 00:46:30,374 అద్భుతమైన విషయమా? నేనొక నరతోడేలుని. 576 00:46:30,457 --> 00:46:32,292 తెలుసు! అమ్మ అది అంత బాగుండే విషయం కాదు అని చెప్పింది, 577 00:46:32,376 --> 00:46:34,837 అంటే, ఎవ్వరినీ కరవవద్దని చెప్పింది, కానీ అది నాకు భలే నచ్చింది! 578 00:46:34,920 --> 00:46:36,046 బాగుంది! 579 00:46:36,129 --> 00:46:39,466 అది మంచి విషయం కాదు. ఇలా ఉంటే నన్ను చంపేస్తారు. నా శరీరం సంగతేంటి? 580 00:46:39,550 --> 00:46:42,177 అది చక్కగా, హాయిగా పడుకొని ఉంది. 581 00:46:42,261 --> 00:46:46,807 చూడు, పడుకున్నప్పుడు తోడేలుగా, లేచినప్పుడు అమ్మాయిగా ఉంటావు. పెద్ద విషయమేమీ కాదు! 582 00:46:46,890 --> 00:46:49,768 కానీ, సైనికులు, ఇంకా మా నాన్న... 583 00:46:49,852 --> 00:46:54,106 దాని గురించి కంగారుపడకు. ముందు తోడేలుగా ఎలా ఉండాలో తెలుసుకో. పద. 584 00:46:54,982 --> 00:46:59,820 ఎందుకు మనిషిగా ఉండటం? తోడేలుగా ఉండటం ఇంకా బాగుంటుంది. నేను నీకు చూపుతాను ఆగు. 585 00:47:01,822 --> 00:47:02,823 నీకు నా వాసన తెలుస్తోందా? 586 00:47:03,407 --> 00:47:05,367 తెలియకేం. ఆందరికీ తెలుస్తుంది. 587 00:47:05,951 --> 00:47:07,786 ఒకసారి నీ కళ్లు మూసుకో. 588 00:47:10,038 --> 00:47:12,624 చూడటానికి నీ కనుల సాయం నీకు అక్కర్లేదు. 589 00:47:13,208 --> 00:47:17,004 ఇంకా నువ్వు కదిలే ప్రతి చిన్న వస్తువు తాలూకు శబ్దాన్ని వినగలవు. 590 00:47:19,339 --> 00:47:22,092 ఇంకా నీ పాదాలకు భూమిలోని శబ్దాలు తెలుస్తాయి. 591 00:47:30,475 --> 00:47:32,477 ఇప్పుడు నీకు నాలుగు కాళ్లున్నాయి, 592 00:47:32,561 --> 00:47:35,522 కాబట్టి నువ్వు చాలా వేగంగా పరిగెత్తగలవు, చాలా ఎత్తుకు ఎగరగలవు! 593 00:47:37,482 --> 00:47:38,984 హేయ్, నా కోసం ఆగు! 594 00:47:40,611 --> 00:47:43,197 నీ ముక్కును కాస్త కిందికి ఉంచు! తోడేలులాగా ప్రవర్తించు! 595 00:48:15,020 --> 00:48:16,146 వాటిని నువ్వు బయటకు పంపుతున్నావా? 596 00:48:16,230 --> 00:48:19,316 అడవి, రాత్రి మాది అయిపోతుంది. చూసేదాకా ఆగు. 597 00:49:46,069 --> 00:49:49,448 ఊరి పాపా, మనం ఈ ప్రాంతం దాటి వెళ్లం. 598 00:49:49,531 --> 00:49:51,575 రోజురోజుకూ అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. 599 00:49:51,658 --> 00:49:57,331 తెలుసు. వారిని బెదరగొట్టాలనే చూస్తున్నా... వాళ్లకది అర్థమవ్వట్లేదు. 600 00:49:59,958 --> 00:50:00,959 అదెలా ఉంది? 601 00:50:03,462 --> 00:50:05,214 అక్కడ చాలా మంది కంపుకొట్టేవాళ్ళు ఉన్నారు. 602 00:50:05,297 --> 00:50:06,798 హేయ్, నేను కూడా అక్కడే ఉన్నాను. 603 00:50:06,882 --> 00:50:09,510 బాగా గురకపెడుతూ నిద్రపోతున్నావులే. 604 00:50:16,850 --> 00:50:19,728 నేను బయలుదేరితే మంచిది. నాకు భయంగా ఉంది, మెబ్. 605 00:50:20,103 --> 00:50:22,481 అవును. ఊరిలో తోడేలుగా ఉండటం కష్టం. 606 00:50:22,564 --> 00:50:25,317 నాకు తెలుసు. నన్ను చంపకపోయినా, కనీసం బంధించి బోనులో పెట్టేస్తారు. 607 00:50:27,528 --> 00:50:29,488 మెబ్, మీ అమ్మను, వాళ్లేమైనా పట్టేసుకున్నారేమోనని... 608 00:50:29,571 --> 00:50:32,741 లేదు! మా అమ్మను ఎవ్వరూ పట్టుకోలేరు. 609 00:50:33,909 --> 00:50:36,453 మన్నించు. మీ అమ్మ వెళ్లి ఎంత కాలమవుతోంది? 610 00:50:36,537 --> 00:50:37,538 ఎంత కాలమంటే... 611 00:50:38,956 --> 00:50:43,085 తను బాగానే ఉంది. త్వరలోనే వచ్చేస్తుంది. నాకు మాట ఇచ్చింది. 612 00:50:44,127 --> 00:50:47,881 చింతించకు. తను ఎక్కడున్నా కానీ, మనం తనను కనిపెడతాం. నీకు నేను సాయపడగలను. 613 00:50:47,965 --> 00:50:49,716 అవును! ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా. 614 00:50:49,800 --> 00:50:51,552 రేపు నేను దొంగచాటుగా వచ్చి, నిన్ను ఇక్కడే కలుస్తా. 615 00:50:51,635 --> 00:50:54,388 నేను మళ్లీ నీ కోసం వేచి చూస్తూ ఉంటాను! 616 00:50:54,471 --> 00:50:57,850 మెబ్, తనెక్కడుందో మనం కనిపెట్టగలం. అప్పుడు మీరందరూ వెళ్లిపోయి, క్షేమంగా ఉండగలరు. 617 00:50:58,392 --> 00:51:00,060 నువ్వు మాటిస్తున్నావా? 618 00:51:00,143 --> 00:51:01,144 నేను మాటిస్తున్నాను. 619 00:52:30,734 --> 00:52:32,736 తోడేలు! దాన్ని పట్టుకోండి! 620 00:52:33,779 --> 00:52:35,531 అదుగో తోడేలు! కాల్చండి! 621 00:52:39,284 --> 00:52:40,452 తోడేలు! ఊరిలోకి తోడేలు వచ్చింది! 622 00:52:40,536 --> 00:52:42,037 -తోడేలు! -ఊరిలోకి తోడేలు వచ్చింది! 623 00:52:42,120 --> 00:52:43,455 దేవుడా! 624 00:52:48,335 --> 00:52:50,295 జమీందారుకు ఇది నచ్చే విషయం కాదు! 625 00:52:55,300 --> 00:52:57,010 -వెంటనే దాన్ని తెరవండి! -తోడేలు! 626 00:52:58,303 --> 00:52:59,346 తోడేలు. 627 00:53:01,223 --> 00:53:02,391 వెంటనే దాన్ని పట్టుకోండి! 628 00:53:02,474 --> 00:53:04,393 -అలాగే, సర్. -తుపాకులు సిద్ధం చేసుకొని, చుట్టుముట్టండి! 629 00:53:05,269 --> 00:53:06,770 -తోడేలును చంపండి! -తోడేలును చంపండి! 630 00:53:06,854 --> 00:53:08,438 దాన్ని చంపండి! ఆ మృగాన్ని చంపండి! 631 00:53:09,356 --> 00:53:10,315 కాల్చండి! 632 00:53:12,943 --> 00:53:14,444 ఆ తోడేలును అంతమొందించండి! 633 00:53:15,654 --> 00:53:17,865 గుడ్ఫెలో, ఏంటిది? 634 00:53:20,075 --> 00:53:25,247 ఇక ఆపండి! ఈ తోడేలు సంగతిని నేనే చూస్తాను. ఇక మీరు వెళ్లి పడుకోండి. 635 00:53:32,671 --> 00:53:34,590 -మీకు అది కనబడిందా? -ఎటు వెళ్లిపోయింది? 636 00:53:34,673 --> 00:53:36,383 వెతుకుతూనే ఉండండి. ఇక్కడే ఎక్కడో ఉంది. 637 00:53:52,316 --> 00:53:53,817 ఆ వాసన. 638 00:53:53,901 --> 00:53:55,903 -నాకు ఆ వాసన తెలుసు. -తోడేలు కోటలో ఉంది! 639 00:53:55,986 --> 00:53:57,154 మీకు అది కనబడిందా? 640 00:53:57,237 --> 00:53:59,239 అణువణువూ వెతకండి. 641 00:53:59,615 --> 00:54:01,325 దాన్ని పారిపోనివ్వకండి! 642 00:54:03,160 --> 00:54:04,369 పాప. 643 00:54:06,914 --> 00:54:07,915 పాప. 644 00:54:08,999 --> 00:54:10,459 పాపా, త్వరగా ఇక్కడికి వచ్చేయ్. 645 00:54:24,932 --> 00:54:26,266 హలో? 646 00:54:27,226 --> 00:54:30,729 కేవలం ఒక నరతోడేలు మాత్రమే మరొకదాన్ని చేయగలదు. నీకిది ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 647 00:54:30,812 --> 00:54:33,232 నిన్ను కరిచిన తోడేలు దగ్గర్లోనే ఉందా? తను బాగానే ఉందా? 648 00:54:33,315 --> 00:54:35,442 తను బతికే ఉందా? మెబ్ ఎక్కడ ఉంది? 649 00:54:37,778 --> 00:54:40,864 మీరు మెబ్ అమ్మ కదా. మిమ్మల్ని కనిపెట్టానని తనకి చెప్పేదాకా ఆగండి. 650 00:54:40,948 --> 00:54:43,534 తను చాలా సంతోషిస్తుంది. తను అడవిలో మీ కోసం ఎదురుచూస్తోంది. 651 00:54:43,617 --> 00:54:45,869 తను ఇంకా అడవులలోనే ఉంది అని అంటున్నావా? 652 00:54:45,953 --> 00:54:48,330 లేదు, లేదు! తను వెళ్లిపోవాలి! 653 00:54:48,413 --> 00:54:50,707 కానీ మేము మిమ్మల్ని కాపాడాలి. మిమ్మల్ని ఎలా తప్పించగలను? 654 00:54:51,500 --> 00:54:53,377 తోడేలు! కోటలో తోడేలు ఉంది! 655 00:54:53,460 --> 00:54:55,254 ఇలా ఉంటే నువ్వు చావడం ఖాయం. 656 00:54:55,337 --> 00:54:57,339 విను, పాపా, వెంటనే నీ మనిషి రూపంలోకి మారిపో. 657 00:54:57,422 --> 00:54:58,632 నేను ఈ గడిని తీయగలిగితే... 658 00:54:58,715 --> 00:55:00,801 తను నిన్ను అసలు కరిచి ఉండాల్సింది కాదు. 659 00:55:00,884 --> 00:55:04,096 మెబ్ తో కలిసి వెళ్లిపో. మన జాతికి ఈ ప్రాంతం సురక్షితం కాదు. 660 00:55:04,179 --> 00:55:06,974 -కానీ మెబ్ మీరు లేకుండా వెళ్లదు. -తను నా కోసం ఇక్కడికి రాకూడదు. 661 00:55:07,057 --> 00:55:10,227 తను నా కోసం ఆగకూడదు. తను వెళ్లిపోవాలి. నువ్వు కూడా, పాపా. 662 00:55:10,310 --> 00:55:11,311 వెంటనే! 663 00:55:34,751 --> 00:55:37,254 ప్రభూ, ఇప్పుడు నేనేం చేయాలి? 664 00:55:37,337 --> 00:55:40,382 ఒక తిరుగుబాటును అణచివేద్దామని వెళ్లాను, కానీ ఇక్కడ అది మరీ ఉదృతంగా ఉంది. 665 00:55:40,966 --> 00:55:44,136 ఈ అనాగరిక ప్రాంతంలోకి నాగరికతను తేవాలి. 666 00:55:44,219 --> 00:55:46,388 అదే మీ అభీష్టం. 667 00:55:52,769 --> 00:55:53,770 కనుక, తోడేలు, 668 00:55:53,854 --> 00:55:56,940 నిన్ను అదుపులోకి తీసుకున్నానని నేను వాళ్లకందరికీ రేపు చూపుతాను, 669 00:55:57,024 --> 00:55:59,651 అలాగే ఈ భూమిని కూడా అదుపులోకి తీసుకుంటాను. 670 00:56:00,444 --> 00:56:05,115 ప్రభువు అభీష్టాన్ని విశ్వసిస్తే, వారికి భయపడాల్సిన అవసరం ఉండదు. 671 00:56:06,241 --> 00:56:07,451 -ఏంటి... -వెళ్లిపో! 672 00:56:09,411 --> 00:56:11,997 సమూహాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లమని మెబ్ కి చెప్పు. 673 00:56:12,080 --> 00:56:13,540 వెంటనే వెళ్లిపో! 674 00:56:49,868 --> 00:56:51,119 ఇదెలా చేయాలి? 675 00:56:51,745 --> 00:56:53,580 కమాన్, కమాన్. 676 00:56:58,043 --> 00:56:59,211 కమాన్. 677 00:57:02,631 --> 00:57:04,007 రాబిన్, నువ్వు మేల్కొన్నావా? 678 00:57:04,091 --> 00:57:06,510 -ఏంటి, నాన్నా? -మన ఇంట్లోకి ఇంతకుముందు ఓ తోడేలు వచ్చింది. 679 00:57:06,593 --> 00:57:08,929 నువ్వు నిద్రలో ఉన్నప్పుడు వచ్చింది. నిన్ను చంపేసి ఉండేది. 680 00:57:09,012 --> 00:57:10,013 నాన్నా, నేను... 681 00:57:10,097 --> 00:57:12,599 ఈ ప్రాంతం నీకు అంత సురక్షితమైంది కాదు, బంగారం. 682 00:57:13,350 --> 00:57:15,811 -నీకు ఏమీ కాకూండా చూసుకుంటానని మాటిచ్చాను. -కానీ అది... 683 00:57:18,939 --> 00:57:21,441 -మాతో రా. -జమీందారు గారు నీతో ఏదో మాట్లాడాలట. 684 00:57:21,525 --> 00:57:23,277 వెనక్కు తగ్గు! 685 00:57:23,360 --> 00:57:26,321 సైనికులారా! ఈ విషయంలో మీరేం చేస్తున్నారు? 686 00:57:28,866 --> 00:57:32,327 గుడ్ఫెలో. ఒక తోడేలు ఇక్కడికి వచ్చి, ఊరిని గడగడలాడిస్తోంది. 687 00:57:32,411 --> 00:57:35,706 కోటలోకి వచ్చి, నా అంతఃపురం లోపలికే ప్రవేశించగలిగింది. 688 00:57:35,789 --> 00:57:37,624 -ఇది క్షమార్హమైన విషయం కాదు. -సర్, నేను... 689 00:57:37,708 --> 00:57:40,294 ఇక చాలు! నువ్వు విఫలమయ్యావు. నువ్వు వేటగాడివి కానే కాదు. 690 00:57:40,377 --> 00:57:43,630 ఇప్పట్నుంచి, నువ్వు నా బలగంలో ఒక సాధారణ సైనికుడిగా విధులు నిర్వర్తిస్తావు. 691 00:57:46,592 --> 00:57:50,637 -జనులారా! దయచేసి శాంతించండి! శాంతించండి! -నిశబ్దంగా ఉండండి. 692 00:57:51,138 --> 00:57:53,140 రేపు, నేను మీకు అందరికీ చూపుతాను. 693 00:57:53,223 --> 00:57:57,811 ఈ నేలను నేను అదుపులోకి తెచ్చుకుంటాను. ఆ గుహను నేను కనిపెడతాను. 694 00:57:57,895 --> 00:58:00,731 ఒక్క తోడేలును కూడా బతకనివ్వను. 695 00:58:00,814 --> 00:58:02,441 వద్దు! ఆగండి! 696 00:58:02,524 --> 00:58:03,609 దానికి ఇంకో మార్గం ఉంది! 697 00:58:03,692 --> 00:58:05,944 ఆ నరతోడేలును వదిలేయండి. 698 00:58:07,112 --> 00:58:08,197 ఏంటి... 699 00:58:08,280 --> 00:58:10,782 దయచేసి, చెప్పేది వినండి! 700 00:58:11,575 --> 00:58:12,743 తనని చెరసాలలోకి తీసుకువెళ్లండి. 701 00:58:12,826 --> 00:58:14,203 -వద్దు! సర్, దయచేసి ఆ పని చేయకండి! -మాట్లాడకు! 702 00:58:14,286 --> 00:58:16,538 తను ఒక చిన్న పిల్ల. నాకు ఈ అడవులు బాగా తెలుసు. 703 00:58:16,622 --> 00:58:18,790 -ఇప్పటికీ మీ పనిలో నేను సాయపడగలను. -మాట్లాడకు! 704 00:58:21,418 --> 00:58:24,213 ఇప్పుడు ఏమీ కాదు! ఇక వెళ్లి పడుకోండి! 705 00:58:24,296 --> 00:58:27,716 రేపు, మీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. 706 00:58:27,799 --> 00:58:29,092 కాపలాదారులారా! కాపలాదారులారా! 707 00:58:29,176 --> 00:58:32,471 -వెళ్లిపోండి! ఇక వెళ్లండి! -ఇక్కడి నుండి వెళ్లిపోండి! 708 00:58:32,554 --> 00:58:36,225 గుడ్ఫెలో, మీ ఇద్దరికీ నేను మరొక్క ఆఖరి అవకాశం ఇస్తున్నాను. 709 00:58:36,308 --> 00:58:38,727 మీకు ఇచ్చిన ఆదేశాలను పాటించండి, లేదంటే నిన్ను యుద్ధానికి పంపేస్తాను. 710 00:58:38,810 --> 00:58:39,811 అలాగే, ప్రభూ. 711 00:58:39,895 --> 00:58:41,438 అమ్మాయి, దగ్గరికి రా. 712 00:58:42,940 --> 00:58:45,943 ఈ ఊరిలో అలాంటి పాత కాలపు చెత్తను వాగకు. 713 00:58:46,026 --> 00:58:50,572 నియమాలను పాటించు, లేకపోతే మీ నాన్నను ఇక జీవితంలో నువ్వు చూడలేవు. అర్థమైందా? 714 00:58:51,114 --> 00:58:52,533 అలాగే, ప్రభూ. 715 00:58:53,367 --> 00:58:55,452 కాపలాదారుల సంఖ్యను రెట్టింపు చేయండి, ద్వారాన్ని మూసేయండి. 716 00:58:55,536 --> 00:58:58,413 గోడలను దాటి ఇకపై తోడేళ్లు లోపలికి ప్రవేశించకూడదు. 717 00:58:58,497 --> 00:59:00,207 అలాగే, సర్. రెట్టింపు చేస్తాం! 718 00:59:06,255 --> 00:59:10,467 చెప్పేది విను. మనం కలిసి ఉండాలంటే మన ఆదేశాలను మనం పాటించాలి. 719 00:59:10,884 --> 00:59:13,554 నువ్వు చెప్పిన మాటను వినాలి, పాపా. 720 01:00:27,002 --> 01:00:31,089 కొత్త నేస్తం పరిచయమైంది, అమ్మా. ఊరి పిల్లే, కానీ మంచిది. 721 01:00:31,632 --> 01:00:32,883 తన పేరు రాబిన్. 722 01:00:32,966 --> 01:00:35,761 తను నా కంటే పొడుగ్గా ఉంటుంది, కానీ నాకే బలం ఎక్కువ. 723 01:00:35,844 --> 01:00:38,889 తను నా జుట్టును దువ్వి, ఈ పువ్వును ఇచ్చింది. 724 01:00:38,972 --> 01:00:41,350 తను ఇంగ్లండ్ అనే చోటు నుండి వచ్చింది. 725 01:00:41,433 --> 01:00:43,685 రేపు మేము సిందూర వృక్షం దగ్గర కలుసుకోబోతున్నాం. 726 01:00:44,186 --> 01:00:46,021 సహాయం చేస్తానని మాట ఇచ్చింది. 727 01:00:46,104 --> 01:00:49,233 నువ్వు... నువ్వు ఎక్కడ ఉన్నావు? 728 01:00:50,317 --> 01:00:54,613 నువ్వు తిరిగి వస్తావని మాట ఇచ్చావు, కానీ చాలా కాలం అయిపోయింది. 729 01:00:55,155 --> 01:00:58,075 నువ్వు దారి తప్పావా? నీకు ఏమైనా అయిందా? 730 01:00:59,243 --> 01:01:02,955 నీ జాడను కనుక్కోవడంలో రాబిన్ నాకు సాయపడుతుంది, అమ్మా. నాకు మాటిచ్చింది. 731 01:01:03,622 --> 01:01:05,165 ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం. 732 01:01:07,876 --> 01:01:12,089 లాలి జో లాలి జో 733 01:01:12,172 --> 01:01:16,093 లాలి జో లాలి జో 734 01:01:24,059 --> 01:01:25,853 రాబిన్, పనికి వెళ్ళాల్సిన సమయమైంది. 735 01:01:40,117 --> 01:01:42,452 మెర్లిన్, నేను మెబ్ దగ్గరకి వెళ్లలేను. 736 01:01:42,536 --> 01:01:44,913 తను ఎక్కడుందో చూడు. ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పు. 737 01:01:44,997 --> 01:01:47,416 తనను వెళ్లిపొమ్మను. ఇక్కడ ఉండకూడదు. 738 01:01:48,917 --> 01:01:50,669 కనీసం నువ్వు అయినా స్వేచ్ఛగా ఉండు. 739 01:02:03,015 --> 01:02:04,558 ఇది నీ మంచి కోసమే, బంగారం. 740 01:02:51,605 --> 01:02:53,649 పక్షీ! సమయానికి వచ్చావు. 741 01:02:53,732 --> 01:02:55,567 రాబిన్, ఎందుకు నీకు ఇంత ఆలస్యమయింది? 742 01:02:58,403 --> 01:03:01,198 రాబిన్! ఎక్కడ ఉన్నావు? 743 01:03:03,575 --> 01:03:05,953 తను ఊరును దాటి రాలేదు అనడంలో నీ ఉద్దేశమేమిటి? 744 01:03:09,206 --> 01:03:13,085 నేను వెళ్లలేను. తను నాకు మాటిచ్చింది. తనని కనిపెట్టడంలో సాయపడు, మెర్లిన్. 745 01:03:46,994 --> 01:03:48,495 నువ్వు ఏమైపోయావు? 746 01:03:49,746 --> 01:03:51,248 మెబ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 747 01:03:51,331 --> 01:03:53,792 నేను కళ్లు కాయలయ్యేలా వేచి చూశాను! 748 01:03:53,876 --> 01:03:55,335 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 749 01:03:55,419 --> 01:03:56,753 అది చెప్పడానికే మెర్లిన్ ని పంపాను. 750 01:03:56,837 --> 01:03:59,256 ఆ? ఏం చేస్తున్నావు, పాపా? ఎవరితో మాట్లాడుతున్నావు? 751 01:03:59,339 --> 01:04:00,924 ఎవ్వరూ లేరు. 752 01:04:01,675 --> 01:04:04,678 నేను ముడులని వేయడం మర్చిపోయాను. ఆ పని ఈపాటికి అయిపోయుండాలి. 753 01:04:04,761 --> 01:04:07,181 నువ్వు వెళ్లిపోవాలి, మెబ్. సమూహాన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లు. 754 01:04:07,264 --> 01:04:10,559 చెప్పా కదా. మా అమ్మ లేనిదే నేను ఎక్కడికీ వెళ్లనని. 755 01:04:14,313 --> 01:04:16,398 మెబ్, నువ్వు నా మాట వినాలి. 756 01:04:16,481 --> 01:04:19,026 నువ్వు అడవిలో ఉండకూడదు. తోడేళ్లను తీసుకొని వెళ్లిపో. 757 01:04:19,610 --> 01:04:21,737 కానీ... నువ్వు నాకు సహాయపడతావు అని చెప్పావు. 758 01:04:21,820 --> 01:04:25,282 -సాయపడుతున్నాను, కానీ నాకు ఈ మార్గమే ఉంది. -నువ్వు మాటిచ్చావు. 759 01:04:25,365 --> 01:04:29,036 జమీందారు అడవులను తగలబెట్టేస్తాడు. అన్ని తోడేళ్లను సూర్యాస్తమయానికి చంపేస్తాడు. 760 01:04:29,119 --> 01:04:31,705 నువ్వు తోడేళ్లను అడవిలో ఉంచకూడదు. అర్థమైందా? 761 01:04:34,208 --> 01:04:35,292 ఇప్పుడే వెళ్లిపో. 762 01:04:37,336 --> 01:04:40,923 నాకు సాయపడతానని నువ్వు మాట ఇచ్చావు. 763 01:04:42,508 --> 01:04:46,720 వెళ్లిపో, మెబ్. మెర్లిన్ ని కూడా తీసుకెళ్లు. సెలవు. 764 01:05:16,041 --> 01:05:17,668 అతని వద్ద ఒక తోడేలు ఉందని విన్నాను. 765 01:05:17,751 --> 01:05:21,463 అది పట్టుకోలేనంత పెద్దది అని విన్నాను. తోడేలు కన్నా పెద్దది అట. 766 01:05:21,547 --> 01:05:24,550 -అమ్మా? -చూస్తే బాగుంటుంది కదా. 767 01:05:25,676 --> 01:05:28,679 అతను దాన్ని చంపేస్తాడు అంటావా? 768 01:05:28,762 --> 01:05:31,515 అవును. అదొక మృగం. 769 01:05:31,598 --> 01:05:33,684 -అమ్మా! -పిచ్చి పిల్ల! 770 01:05:33,767 --> 01:05:35,143 -జాగ్రత్త, పాపా! -చూసుకో! 771 01:05:35,227 --> 01:05:37,437 నీ వల్ల ఎవరైనా గాయపడవచ్చు. 772 01:05:39,773 --> 01:05:43,235 పదండి, అమ్మాయిలూ, అందరూ ఆవరణలో ఉండాలి. 773 01:05:46,488 --> 01:05:50,659 అందరూ బయట ఉండాలని జమీందారు ఆదేశం, పాపా. పద. 774 01:05:53,704 --> 01:05:57,124 వాళ్లు ఒక పెద్ద బోను తెచ్చారు. దాన్ని వేదిక మీదికి తెస్తారు. 775 01:05:58,125 --> 01:05:59,543 అయ్యో. 776 01:06:08,969 --> 01:06:12,222 నా మాట వినండి! నేనే గొప్ప సైనికుడిని! 777 01:06:12,306 --> 01:06:16,310 నెట్టండి! నెట్టండి! ఇంకాస్త ముందుకు నెట్టండి. 778 01:06:17,978 --> 01:06:20,647 మంచిది. చాలు. ఇక దూరం జరగండి. 779 01:06:20,731 --> 01:06:22,357 మీ స్థానాలకు వెళ్లిపోండి. 780 01:06:23,650 --> 01:06:27,112 -మెబ్, దయచేసి ఆగు! -మా అమ్మ ఇక్కడే ఉంది! నన్ను వదులు! 781 01:06:27,196 --> 01:06:28,780 మెబ్. వద్దు! 782 01:06:30,449 --> 01:06:35,412 కిల్కెన్నీ వాసులారా, మీ ఆందోళన నాకు అర్థమైంది. 783 01:06:35,495 --> 01:06:41,460 తోడేళ్ల దాడులు, పశువులు మాయమవ్వడం, ఒక తోడేలు మన వీధుల్లోనే సంచరించడం. 784 01:06:41,543 --> 01:06:44,505 -కానీ నా మాట వినండి. భయపడకండి. -మెబ్, ఆగు. 785 01:06:45,756 --> 01:06:47,007 నన్ను వదులు! 786 01:06:47,090 --> 01:06:48,800 ఇక్కడి నుండి నువ్వు వెంటనే వెళ్లిపోవాలి. 787 01:06:48,884 --> 01:06:51,970 నన్ను వదులు. వదులు. 788 01:06:52,054 --> 01:06:55,724 హేయ్! ఇక్కడ నేనొక తోడేలును పట్టుకున్నాను. 789 01:06:55,807 --> 01:06:59,478 -...ఒక నాగరికత కల దేశం. -తను ఒక తోడేలును పట్టుకుంది. 790 01:06:59,561 --> 01:07:00,812 మనం... 791 01:07:00,896 --> 01:07:04,024 నా తోటి వేటగాళ్లలారా, మనకి చంపడానికి ఒక కొత్త తోడేలు దొరికింది. 792 01:07:04,983 --> 01:07:07,110 వద్దు. వద్దు! నన్ను వదులు. 793 01:07:09,613 --> 01:07:13,075 నేను మా అమ్మను కనుగొనాలి. నన్ను వదిలేయండి. 794 01:07:13,158 --> 01:07:16,328 రాబిన్, ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు? 795 01:07:17,704 --> 01:07:20,832 నేను మీ అందరినీ తినేస్తాను! నన్ను విడిచిపెట్టండి! 796 01:07:20,916 --> 01:07:23,418 మెబ్, నిన్ను సురక్షితంగా ఉంచమని మీ అమ్మ నాకు చెప్పింది. 797 01:07:23,502 --> 01:07:26,046 ఓ అబద్ధాలకోరుదానా! నీకు ముందే తెలుసు అన్నమాట! 798 01:07:27,714 --> 01:07:30,300 ఇది నీ మంచి కోసమే. నన్ను క్షమించు. 799 01:07:30,384 --> 01:07:32,052 తోడేలును పట్టుకోండి... 800 01:07:32,135 --> 01:07:36,181 ఈ అడవిని వశపరుచుకోవడానికి 801 01:07:36,265 --> 01:07:38,934 స్వయంగా నన్ను ఆ ప్రభువే పంపాడు. 802 01:07:39,017 --> 01:07:44,064 దాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చని నేను మీకు చూపుతాను. చూడండి. 803 01:07:51,071 --> 01:07:52,155 -తోడేలు! -అమ్మా! 804 01:07:54,032 --> 01:07:55,784 -తోడేలును చంపేయండి! -తోడేలును చంపేయండి! 805 01:07:57,536 --> 01:07:58,871 తోడేలును చంపేయండి! 806 01:07:58,954 --> 01:08:00,080 ఆ మృగాన్ని చంపేయండి! 807 01:08:04,293 --> 01:08:06,170 అతని వద్ద తోడేలు ఉంది. 808 01:08:06,253 --> 01:08:10,591 చాలు! ఇక చాలు! శాంతించండి! శాంతించండి! 809 01:08:11,550 --> 01:08:14,678 ఈ మృగం వలన మీరు భయపడవలసిన పని లేదు. 810 01:08:14,761 --> 01:08:17,346 ఇప్పుడు, తలుపును తెరవండి. 811 01:08:36,450 --> 01:08:39,036 -ఆ తోడేలును చంపేయండి. -ఇప్పుడే కానివ్వండి. 812 01:08:41,496 --> 01:08:46,667 చూశారా? ఒకప్పుడు వన్యమృగమైన ఇది ఇప్పుడు అదుపులోనే ఉంది. 813 01:08:46,752 --> 01:08:50,339 చెప్పినట్టు వింటుంది. ఒక విశ్వాసబద్ధ దాసిలా అన్నమాట. 814 01:08:52,508 --> 01:08:56,886 ఈ జుగుప్సాకరమైన జీవుల నుండి మన భూమిని నేను కాపాడతాను. 815 01:08:56,970 --> 01:08:59,765 అమ్మ. అమ్మా! అమ్మా! 816 01:09:02,559 --> 01:09:04,060 మెబ్, వద్దు! 817 01:09:10,484 --> 01:09:13,319 హేయ్! అమ్మా, అమ్మా. నేను వచ్చేశా, అమ్మా. 818 01:09:13,403 --> 01:09:15,197 -ఏంటిది? ఇక్కడేం జరుగుతోంది? -నేను వచ్చేశా, అమ్మా. 819 01:09:15,279 --> 01:09:18,200 తనని విడిచిపెట్టు! ఆమె మా అమ్మ! 820 01:09:19,785 --> 01:09:21,036 తనని విడిచిపెట్టు! 821 01:09:21,662 --> 01:09:24,288 గుడ్ఫెలో, ఈ పిచ్చిదాన్ని అదుపులోకి తీసుకో. 822 01:09:35,341 --> 01:09:38,136 గుడ్ఫెలో, నువ్వు ఏదీ పట్టుకోలేవా? ఏం చేస్తున్నావు? 823 01:09:41,723 --> 01:09:43,642 ఆ రాకాసికి సంకెళ్లు వేసి, చెరసాలలో బంధించు. 824 01:09:43,725 --> 01:09:46,019 నాన్నా! వద్దు! 825 01:09:52,859 --> 01:09:53,861 -కాపలాదారులారా! -ఆగు! 826 01:09:53,944 --> 01:09:54,945 కదలకు. 827 01:09:55,571 --> 01:09:57,030 అక్కడే ఉండు, పిచ్చిదానా. 828 01:10:00,325 --> 01:10:02,494 నాన్నా! వద్దు! వద్దు! 829 01:10:02,578 --> 01:10:03,829 రాబిన్! అక్కడే ఉండు! 830 01:10:05,539 --> 01:10:07,916 నాన్నా, వద్దు! ఇది తప్పు! 831 01:10:08,000 --> 01:10:09,501 రాబిన్! ఇక్కడి నుండి వెళ్లిపో! 832 01:10:10,169 --> 01:10:11,461 బాబోయ్! 833 01:10:15,549 --> 01:10:17,009 -ఒక సైనికుడిని కరిచింది! -నాన్నా! 834 01:10:17,092 --> 01:10:18,051 అతడిని తోడేలు కరిచింది! 835 01:10:19,928 --> 01:10:21,930 దాన్ని వెనక్కి లాగండి. వెనక్కి లాగండి. 836 01:10:22,014 --> 01:10:23,390 -బాబోయ్! -అంతే. 837 01:10:23,473 --> 01:10:25,142 -వామ్మోయ్! -దాన్ని బంధించేయండి! 838 01:10:25,225 --> 01:10:27,811 -అలా చేయకు! -ముసుగు వేసేయి! 839 01:10:28,645 --> 01:10:29,646 అమ్మా! 840 01:10:32,232 --> 01:10:35,277 అమ్మా. వీళ్లెంత పని చేశారు? 841 01:10:54,213 --> 01:10:55,464 పారిపోకు. అబ్బా! 842 01:11:00,177 --> 01:11:02,513 నేనొక నరతోడేలుని! 843 01:11:03,805 --> 01:11:07,559 నేను నా తోడేళ్లతో వస్తాను, మా అమ్మను విడిపిస్తాను! 844 01:11:07,643 --> 01:11:10,145 ఆ తర్వాత మీ అందరినీ మేము తినేస్తాం! 845 01:11:22,449 --> 01:11:26,119 జనులారా! వినండి. నా మాట వినండి. 846 01:11:26,203 --> 01:11:30,832 ఆ అడవి అమ్మాయిల గురించి, తోడేళ్ల గురించి భయపడకండి, 847 01:11:30,916 --> 01:11:34,169 ఎందుకంటే, మనం ఈ రాత్రికే దీనికి ముగింపు పలకబోతున్నాం. 848 01:11:34,253 --> 01:11:38,090 ఈ అడవినంతటినీ కాల్చి బూడిద చేసేస్తాను. 849 01:11:38,173 --> 01:11:41,510 ఈ మృగాల గుహ వద్దకు ఫిరంగులను తీసుకువెళ్లి, 850 01:11:41,593 --> 01:11:44,930 -వాటినన్నింటినీ యమలోకానికి పంపించేస్తాను. -వద్దు! 851 01:11:45,013 --> 01:11:48,851 మనదే విజయం. అదే ప్రభువు అభీష్టం. 852 01:11:49,393 --> 01:11:51,144 -బలగాన్ని సిద్ధం చేయండి. -అలాగే, సర్. 853 01:11:51,228 --> 01:11:52,813 -పదండి. -పదండి. 854 01:11:52,896 --> 01:11:54,356 ఇక పదండి. 855 01:11:54,439 --> 01:11:58,402 గుడ్ఫెలో, నీకు ఏమయింది? ఒక చిన్న అమ్మాయిని కూడా పట్టుకోలేవా? 856 01:11:58,944 --> 01:12:01,530 ఈరాత్రి ఒక సైనికుడిగా నీ ప్రతిభను చూపెట్టు, 857 01:12:01,613 --> 01:12:03,699 లేదా రేపు నువ్వు సంకెళ్లలో ఉంటావు. 858 01:12:03,782 --> 01:12:06,577 ఇక, ఈ వన్యమృగాన్ని అంతం చేసేయి. 859 01:12:06,660 --> 01:12:09,246 అదుపులోకి రానిదాన్ని అంతం చేసేయాలి. 860 01:12:09,329 --> 01:12:11,623 దయచేసి అలా చేయకండి. వద్దు. 861 01:12:11,707 --> 01:12:13,041 రాబిన్! ఆపు. 862 01:12:13,125 --> 01:12:18,797 ఇక దయచేసి, ఆ అమ్మాయికి సత్ప్రవర్తన నేర్పు, లేదా సత్ప్రవర్తనను తనకు చూపాల్సి ఉంటుంది. 863 01:12:34,396 --> 01:12:38,734 -ఇక్కడికి. తోయండి. -మెల్లగా. మెల్లగా. పదండి. 864 01:12:38,817 --> 01:12:41,820 -పిల్లలూ. ఇక బయలుదేరండి... -ఇళ్ళకు పదండి. 865 01:12:41,904 --> 01:12:43,780 కోట పరిసరాలలో ఉండవద్దు. 866 01:12:44,364 --> 01:12:46,283 వద్దు, నాన్నా. దయచేసి, ఈ పని చేయవద్దు. 867 01:12:46,366 --> 01:12:48,410 ఇక చాలు. రాబిన్, వెళ్లి నీ విధులను నిర్వర్తించు. 868 01:12:48,493 --> 01:12:50,579 -కానీ నువ్వు ఈ పని చేయవద్దు. -వెంటనే వెళ్లు, పాపా! 869 01:13:08,388 --> 01:13:12,309 త్వరపడండి! ఆ ఆయుధంతో విజయం మన సొంతమవుతుంది. 870 01:13:25,697 --> 01:13:27,407 రాబిన్, నువ్వేం చేస్తున్నావు? 871 01:13:27,491 --> 01:13:29,993 జమీందారు మనల్ని చెరసాలపాలు చేస్తారు. 872 01:13:30,077 --> 01:13:33,622 అతను తప్పు చేస్తున్నాడు, నాన్నా. ఇదంతా తప్పుడు పని. నీకు తెలియడం లేదా? 873 01:13:33,705 --> 01:13:36,416 రాబిన్, పక్కకు తప్పుకో! మనకు ఏం చెప్తే, మనం అదే చేయాలి. 874 01:13:36,500 --> 01:13:38,168 ఎందుకు, నాన్నా? ఎందుకు? 875 01:13:38,252 --> 01:13:39,378 నాకు భయం. 876 01:13:40,963 --> 01:13:42,172 నాకు భయం. 877 01:13:42,256 --> 01:13:43,257 నాన్నా? 878 01:13:44,758 --> 01:13:47,135 ఎల్లకాలం నిన్ను సురక్షితంగా చూసుకోవడానికి నేను ఉండను. 879 01:13:47,219 --> 01:13:50,681 అందుకే నాకు భయం, నువ్వు ఏదోక రోజు చెరసాలపాలవుతావు అని. 880 01:13:52,558 --> 01:13:54,393 నేను ఇప్పుడు చెరసాలలోనే ఉన్నాను. 881 01:13:55,519 --> 01:13:57,145 తోడేళ్లు! తోడేళ్లు! 882 01:14:00,065 --> 01:14:01,775 తోడేళ్లు! తోడేళ్లు! 883 01:14:10,284 --> 01:14:11,618 ఏం జరుగుతోంది? 884 01:14:17,249 --> 01:14:18,750 నన్ను మన్నించు, నాన్నా. 885 01:14:21,295 --> 01:14:22,546 రాబిన్! 886 01:14:22,629 --> 01:14:24,381 -ఆ మృగం తప్పించుకుంది! -బాబోయ్... 887 01:14:25,090 --> 01:14:26,049 అయ్యో! 888 01:14:28,343 --> 01:14:29,344 దాన్ని పట్టుకోండి! 889 01:14:30,512 --> 01:14:31,805 ద్వారాన్ని మూసేయండి. 890 01:14:33,515 --> 01:14:35,851 -ద్వారాన్ని దించండి! -సమీపిస్తోంది! 891 01:14:35,934 --> 01:14:36,977 కాల్పులు జరపండి! 892 01:14:37,060 --> 01:14:38,478 -లేదు! -దాన్ని తప్పించుకోనివ్వకండి! 893 01:14:41,148 --> 01:14:43,275 నేను తనని ఆపాలని చూశాను, కానీ సఫలం కాలేకపోయాను. 894 01:14:43,358 --> 01:14:44,943 తను తన ప్రాణాలను చేజేతులా పోగొట్టుకుంటుంది. 895 01:14:47,070 --> 01:14:48,655 అది ఇటు వైపే వస్తోంది! 896 01:14:51,783 --> 01:14:53,619 ఇక పారిపో! 897 01:14:55,162 --> 01:14:56,788 ద్వారాలను మూసివేయండి! 898 01:14:57,581 --> 01:14:59,124 బ్రిడ్జిని పైకి లాగండి! 899 01:15:03,337 --> 01:15:04,671 ఆయుధాలతో సిద్ధంకండి! 900 01:15:04,755 --> 01:15:06,048 పద. 901 01:15:06,131 --> 01:15:07,341 కాల్చండి! 902 01:15:07,424 --> 01:15:08,967 మృగానికి గురిపెట్టండి! 903 01:15:12,930 --> 01:15:14,848 -తోడేలు! -చూసుకోండి! 904 01:15:33,492 --> 01:15:36,411 ఆ ఊరివాసుల మీద దాడి చేయవలసిన సమయం వచ్చేసింది! 905 01:15:36,495 --> 01:15:38,038 వాళ్లందరినీ తినేద్దాం! 906 01:15:38,121 --> 01:15:39,706 వాళ్ల వద్ద మా... 907 01:15:44,419 --> 01:15:45,420 అమ్మా? 908 01:15:51,301 --> 01:15:52,427 అమ్మా. 909 01:15:57,683 --> 01:16:00,936 అమ్మా! అమ్మా! 910 01:16:06,942 --> 01:16:08,193 అమ్మా, నువ్వు వచ్చేశావు. 911 01:16:08,277 --> 01:16:09,278 మెబ్. 912 01:16:13,949 --> 01:16:18,495 మళ్లీ నిన్ను ఇక చూడలేనేమో అనుకున్నాను... ఈ చిన్నది నన్ను విడిపించే దాకా. 913 01:16:25,127 --> 01:16:27,754 మెబ్, నన్ను మన్నించు. 914 01:16:27,838 --> 01:16:32,676 నిన్ను క్షేమంగా ఉంచాలన్నదే నా ఉద్దేశం. సాయపడాలని చూశాను. ఏం చేయాలో నాకు తెలీలేదు. 915 01:16:32,759 --> 01:16:33,760 నేను... 916 01:16:35,179 --> 01:16:36,471 నన్ను క్షమించు, మెబ్. 917 01:16:43,770 --> 01:16:45,647 వచ్చి నన్ను హత్తుకో, ఊరి పాపా. 918 01:16:52,487 --> 01:16:54,656 నేను ఇప్పుడు ఊరిపాపను కాను, మెబ్. 919 01:16:54,740 --> 01:16:56,116 అమ్మను కాపాడినందుకు ధన్యవాదాలు. 920 01:17:02,289 --> 01:17:03,290 అయ్యో! 921 01:17:03,373 --> 01:17:07,961 అమ్మా! అయ్యయ్యో! అమ్మా ఏమైంది? అయ్యయ్యో! 922 01:17:08,045 --> 01:17:11,089 అమ్మా! అమ్మా! అయ్యో! 923 01:17:11,173 --> 01:17:12,424 రాబిన్! 924 01:17:12,508 --> 01:17:14,218 -అమ్మా! -రాబిన్! పరిగెత్తు! త్వరగా! 925 01:17:14,301 --> 01:17:15,928 అమ్మా, నీకేమైంది? 926 01:17:16,011 --> 01:17:17,012 వద్దు, నాన్నా! 927 01:17:17,095 --> 01:17:19,097 -పద, రాబిన్! -వద్దు, నాన్నా! 928 01:17:19,181 --> 01:17:21,642 -నువ్వు ఆమె మీదకి బాణం ఎలా వదలగలిగావు? -పద! రాబిన్! పరిగెత్తు! 929 01:17:21,725 --> 01:17:23,227 నన్ను వదులు! మెబ్! 930 01:17:23,310 --> 01:17:26,021 -తనకి నేను సాయపడాలి. నన్ను వదులు. -దగ్గరకు రావద్దు! 931 01:17:26,104 --> 01:17:27,689 -దగ్గరకి రావద్దు అన్నానా! రావద్దు! -వద్దు! 932 01:17:27,773 --> 01:17:29,483 -ఎంత పని చేశావు? -దగ్గరకు రావద్దు! రావద్దు! 933 01:17:29,566 --> 01:17:30,776 ఇక్కడి నుండి వెళ్లిపోండి! 934 01:18:27,749 --> 01:18:30,043 ఆగు! వద్దు! నన్ను విడిచిపెట్టు! 935 01:18:30,127 --> 01:18:31,712 -రాబిన్! వద్దు! వెళ్లకు! -ఆపు! 936 01:18:31,795 --> 01:18:33,380 మెబ్! 937 01:18:33,463 --> 01:18:34,965 అయ్యో! 938 01:18:35,048 --> 01:18:37,384 తనకు నేను సాయపడాలి. తను చచ్చిపోతోంది! 939 01:18:37,467 --> 01:18:38,468 కమాన్, రాబిన్! 940 01:18:39,219 --> 01:18:40,512 నన్ను విడిచిపెట్టు! 941 01:18:40,929 --> 01:18:42,681 మెబ్! మెబ్! 942 01:18:42,764 --> 01:18:45,225 వద్దు, రాబిన్! ఎందుకు? నాకు అర్థంకావడం లేదు! 943 01:18:45,309 --> 01:18:50,022 నీకు అర్థమవ్వడం లేదా? నేను కూడా వాళ్లలో ఒకరిని. ఒక నరతోడేలుని. 944 01:18:50,939 --> 01:18:56,069 లేదు, రాబిన్. దయచేసి, నాతోనే ఉండు. నేను నిన్ను విడిచిపెట్టలేను. 945 01:18:56,570 --> 01:18:57,571 నాన్నా. 946 01:19:09,917 --> 01:19:10,918 రాబిన్. 947 01:19:14,963 --> 01:19:16,089 రాబిన్! 948 01:19:27,559 --> 01:19:29,311 -ముందుకు సాగండి! -ఆయుధాలతో సిద్ధంకండి! 949 01:19:29,895 --> 01:19:31,021 హుషారుగా ఉండండి! 950 01:19:31,688 --> 01:19:35,734 గుడ్ఫెలో, నీకు మతి ఏమైనా పోయిందా? ఇక్కడేం జరుగుతోంది? 951 01:19:35,817 --> 01:19:38,070 రాబిన్, తను వెళ్లిపోయింది. 952 01:19:38,862 --> 01:19:41,740 -అతడిని బంధించండి. తన సంగతి మళ్లీ చూద్దాం. -అలాగే, సర్. 953 01:19:44,076 --> 01:19:45,953 ఇవి తాజా అడుగు జాడలు. 954 01:19:46,411 --> 01:19:48,789 ముందుకు సాగండి! మొత్తాన్ని తగలబెట్టేయండి! 955 01:19:48,872 --> 01:19:50,374 అలాగే, సర్. ముందుకు. 956 01:19:50,457 --> 01:19:51,917 -కదలకు. -ముందుకు. 957 01:19:52,000 --> 01:19:54,795 -అడవిని తగలబెట్టండి! -దహింపజేయండి! 958 01:20:41,466 --> 01:20:43,719 భగవంతుడా, నేనెంతటి పని చేశాను? 959 01:20:43,802 --> 01:20:48,223 రాబిన్... రాబిన్, దయచేసి మేలుకో. మేలుకో. 960 01:21:02,404 --> 01:21:03,405 అమ్మా! 961 01:21:05,532 --> 01:21:07,659 అమ్మా, దయచేసి, శ్వాస ఆడించు. 962 01:21:09,411 --> 01:21:15,125 ఇంతటి తీవ్రమైన స్థితిలో ఉన్నవారికి ఎన్నడూ నేను నయం చేయలేదు. దీనికి సమయం పడుతుంది. 963 01:21:16,043 --> 01:21:17,628 నిన్ను విడిచి నేను ఎక్కడికీ వెళ్లను, అమ్మా. 964 01:21:35,020 --> 01:21:36,063 వారిని నేను అడ్డుకుంటాను. 965 01:21:38,232 --> 01:21:39,233 తనని అనుసరించండి. 966 01:21:44,655 --> 01:21:46,198 -చూసుకోండి, బాబులూ! -ఆయుధాలతో సిద్ధంకండి! 967 01:21:46,281 --> 01:21:47,908 సాగడానికి సిద్ధమవ్వండి! 968 01:21:53,497 --> 01:21:55,415 అవి ఆ లోపల ఉన్నాయి! ముందుకు సాగండి! 969 01:21:55,499 --> 01:21:57,584 అలాగే, సర్! ముందుకు సాగండి! 970 01:22:00,045 --> 01:22:03,590 ముందుకు సాగండి. నెట్టండి! నెట్టండి! 971 01:22:07,427 --> 01:22:09,680 మనం వాళ్లని తరిమేయగలం. మనం తోడేళ్ళం. 972 01:22:09,763 --> 01:22:12,599 -హుషారుగా ఉండండి! -తుపాకులు, ఫిరంగితో వస్తున్నారు. 973 01:22:13,851 --> 01:22:17,437 కానీ భయపడకండి. వాళ్లు ఇప్పుడు మన అడవిలో ఉన్నారు. వెళ్దాం పదండి! 974 01:22:20,023 --> 01:22:21,608 -ధైర్యంగా సాగండి! -నెట్టండి! 975 01:22:21,692 --> 01:22:22,734 ఆగకుండా పదండి! 976 01:22:23,694 --> 01:22:25,529 ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. 977 01:22:26,280 --> 01:22:29,074 -తగలబెట్టండి. బయటకు వచ్చేవాటిని చంపేయండి! -అలాగే, సర్! 978 01:22:29,449 --> 01:22:30,784 -విస్తరించి తగలబెట్టండి! -ఎక్కువగా మంట పెట్టండి! 979 01:22:30,868 --> 01:22:32,828 -ఇక్కడ! -దాన్ని తగలబెట్టండి! 980 01:22:33,662 --> 01:22:35,414 -అడవిని తగలబెట్టండి! -ముందుకు సాగండి! 981 01:22:39,668 --> 01:22:42,588 -హేయ్, ఇక్కడ ఎక్కువ మంట పెట్టండి! -పూర్తిగా తగలబెట్టేయండి! 982 01:22:46,133 --> 01:22:47,759 అసలేంటి ఇదంతా? 983 01:23:01,648 --> 01:23:02,649 దూరం జరగండి! 984 01:23:02,733 --> 01:23:04,568 ఇక్కడ ఎక్కువ మంట పెట్టండి! 985 01:23:05,235 --> 01:23:06,820 చెట్లలో కనబడకుండా దాక్కోండి. 986 01:23:08,155 --> 01:23:09,698 ఉచ్చులను ఉపయోగించండి. 987 01:23:10,407 --> 01:23:11,408 దేవుడా! 988 01:23:11,491 --> 01:23:12,618 కాల్పులు జరిపేలాగా చేయండి. 989 01:23:14,119 --> 01:23:16,496 తూటాలు ఎక్కించుకునేటప్పుడు చీకటి మాటు నుండి దాడి చేయండి. 990 01:23:17,998 --> 01:23:20,584 రిపోర్ట్ చేయండి? రిపోర్ట్ చేయండి? 991 01:23:32,846 --> 01:23:33,847 లేదు! 992 01:23:35,098 --> 01:23:37,351 నా వల్ల కాదు, అమ్మా. నా వల్ల కాదు. 993 01:23:37,434 --> 01:23:39,019 నాకు అంత శక్తి లేదు. 994 01:23:39,102 --> 01:23:42,356 దయచేసి, ఏం చేయాలో నాకు చెప్పు. 995 01:23:51,740 --> 01:23:53,867 సమూహం. నాకు సమూహం అంతా కావాలి. 996 01:23:58,038 --> 01:23:59,289 ఏంటి? ఏంటది? 997 01:24:03,752 --> 01:24:04,753 పరిగెత్తండి! 998 01:24:23,355 --> 01:24:24,940 దేవుడా. ఏంటది? 999 01:24:26,733 --> 01:24:28,277 అది నరతోడేలు. 1000 01:24:31,446 --> 01:24:32,865 మంత్రవిద్య. 1001 01:24:32,948 --> 01:24:36,493 -పరిగెత్తండి! ఇక్కడి నుండి పారిపోండి! -మీరేం చేస్తున్నారు? 1002 01:24:36,577 --> 01:24:38,036 అందరూ మళ్లీ ఒకచోటుకు రండి! 1003 01:24:38,120 --> 01:24:39,621 మీ మీ స్థానాలకు చేరుకోండి! 1004 01:24:39,705 --> 01:24:41,290 -మనల్ని చుట్టుముట్టేశాయి. -పరిగెత్తండి! 1005 01:24:47,921 --> 01:24:49,548 దయ చూపండి! దయ చూపండి! 1006 01:24:53,051 --> 01:24:56,388 కాల్చండి! ఇష్టానుసారంగా కాల్పులు జరపండి! 1007 01:24:56,471 --> 01:24:57,723 కాల్చండి! 1008 01:24:59,391 --> 01:25:00,601 ఎక్కడ చూసినా అవే ఉన్నాయి! 1009 01:25:14,114 --> 01:25:15,115 రాబిన్. 1010 01:25:20,829 --> 01:25:21,997 రాబిన్, వెళ్లిపో! 1011 01:25:27,169 --> 01:25:29,838 ఫిరంగి బాబులూ, వాటిని తప్పించుకోనివ్వకండి! 1012 01:25:30,547 --> 01:25:33,175 ఆ చెత్త మృగాలను అంతమొందించండి! 1013 01:25:43,227 --> 01:25:47,439 త్వరగా, అందరూ ఇక్కడికి రండి. నాకు మీ సాయం కావాలి. 1014 01:25:53,612 --> 01:25:54,613 రాబిన్? 1015 01:25:55,280 --> 01:25:56,365 రాబిన్ ఎక్కడ? 1016 01:26:05,457 --> 01:26:09,002 సైనికులారా, మీరు పారిపోయారంటే, చస్తారు. 1017 01:26:09,086 --> 01:26:12,172 నా ఆదేశాలను పాటిస్తే, విజయం మనదే అవుతుంది. 1018 01:26:13,507 --> 01:26:15,425 మనకి ప్రభువే మార్గనిర్దేశం చేస్తున్నాడు. 1019 01:26:18,470 --> 01:26:19,638 రాబిన్. 1020 01:26:20,597 --> 01:26:22,057 ముందుకు తీసుకురండి! 1021 01:26:22,140 --> 01:26:24,059 -ఫిరంగిలోకి తూటాను ఎక్కించండి! -అలాగే, సర్. 1022 01:26:47,791 --> 01:26:51,712 కలుగు నుండి బయటకు రండి, చెత్త జీవులూ. 1023 01:26:51,795 --> 01:26:54,214 వచ్చి, పరలోకానికి పదండి. 1024 01:27:02,306 --> 01:27:05,434 అదుగో, అక్కడే ఉంది ఆ సైతానుల ఆవాసం! 1025 01:27:05,517 --> 01:27:07,728 మన విజయం తథ్యం! 1026 01:27:07,811 --> 01:27:09,479 ఫిరంగి బాబులూ, కాల్చండి! 1027 01:27:12,024 --> 01:27:13,483 తలదాచుకోండి! 1028 01:27:15,527 --> 01:27:16,403 రాబిన్! 1029 01:27:18,405 --> 01:27:19,990 తుపాకీ పట్టిన సిపాయిలూ... 1030 01:27:21,158 --> 01:27:22,242 కాల్పులు జరపండి! 1031 01:27:25,829 --> 01:27:27,247 పారిపోకండి! 1032 01:27:29,374 --> 01:27:30,209 వద్దు, రాబిన్! 1033 01:27:40,010 --> 01:27:41,011 రాబిన్? 1034 01:27:41,094 --> 01:27:42,471 రాబిన్? 1035 01:27:46,141 --> 01:27:47,726 రాబిన్, లేయి. 1036 01:27:57,319 --> 01:27:58,403 పైకిలే! పరిగెత్తు! 1037 01:27:58,487 --> 01:28:00,405 ఇక చాలు, గుడ్ఫెలో. 1038 01:28:08,205 --> 01:28:09,456 పనికిమాలిన పక్షి! 1039 01:28:12,876 --> 01:28:14,962 ఆగు! తను పసి పాప. 1040 01:28:15,045 --> 01:28:19,842 మహోన్నత ప్రభువు యొక్క శిక్ష, నిన్ను అంతమొందిస్తుంది. 1041 01:28:20,425 --> 01:28:22,886 రాబిన్! వద్దు! 1042 01:28:39,236 --> 01:28:41,613 సర్వోత్తమ ప్రభువా, నన్ను కాపాడు. 1043 01:29:41,131 --> 01:29:42,132 గుడ్ఫెలో. 1044 01:30:37,271 --> 01:30:39,398 నీ బాహుబంధములోనికి, ఓ ప్రభువా... 1045 01:30:42,234 --> 01:30:44,444 నా ఆత్మను తీసుకోండి. 1046 01:31:03,130 --> 01:31:04,381 నాన్నా? 1047 01:31:11,096 --> 01:31:12,222 నాన్నా. 1048 01:31:17,853 --> 01:31:19,354 మనం మెబ్ కి సాయపడాలి. 1049 01:31:38,415 --> 01:31:41,210 అమ్మా, దయచేసి, నన్ను విడిచి వెళ్లిపోకు. 1050 01:31:41,752 --> 01:31:43,420 మళ్లీ నన్ను విడిచి వెళ్లిపోకు. 1051 01:31:43,504 --> 01:31:44,796 వేడుకుంటున్నాను. 1052 01:31:45,547 --> 01:31:46,548 మెబ్. 1053 01:31:48,300 --> 01:31:49,343 రాబిన్. 1054 01:31:50,719 --> 01:31:53,263 నేను ప్రయత్నించాను. చాలా తీవ్రంగా ప్రయత్నించాను, 1055 01:31:53,347 --> 01:31:55,474 కానీ నా ఒక్కరి శక్తి చాలడం లేదు. 1056 01:31:58,352 --> 01:31:59,978 నాకు తను కావాలి. 1057 01:32:00,521 --> 01:32:03,023 నేను ఇచ్చిన మాట ప్రకారం సాయపడగలను. 1058 01:32:03,106 --> 01:32:05,734 మెబ్, ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం. 1059 01:32:08,987 --> 01:32:10,781 ఇప్పుడు ఇద్దరం ఉన్నాం. 1060 01:32:11,615 --> 01:32:14,409 ఏం చేయాలో నాకు చూపించు, మెబ్. ఎలా చేయాలో నాకు తెలీదు. 1061 01:32:14,493 --> 01:32:17,079 నేను నీకు చూపుతాను. నేను చేసినట్టే చేయి. 1062 01:32:53,615 --> 01:32:55,742 -ఏంటది? -క్షుద్ర విద్య. 1063 01:33:12,718 --> 01:33:13,760 దేవుడా. 1064 01:33:15,053 --> 01:33:18,807 అది విన్నారా? ఆ సంగీతం చాలా మనోహరంగా ఉంది. 1065 01:34:09,566 --> 01:34:12,194 -మెబ్. -అమ్మా. 1066 01:34:12,277 --> 01:34:15,489 మెబ్, నా చిట్టి తోడేలు. 1067 01:34:15,572 --> 01:34:16,740 అమ్మా, నీకేమీ కాలేదు. 1068 01:34:19,910 --> 01:34:23,080 నువ్వు మళ్లీ నన్ను విడిచివెళ్లిపోయావేమో అనుకున్నాను. నిన్ను మిస్ అయ్యాను. 1069 01:34:25,999 --> 01:34:28,335 ధన్యవాదాలు, నేస్తమా. 1070 01:34:28,919 --> 01:34:30,170 నా నేస్తమా. 1071 01:34:46,311 --> 01:34:47,312 నాన్నా. 1072 01:34:48,981 --> 01:34:50,315 వెళ్లవద్దు. 1073 01:34:54,194 --> 01:34:56,071 దయచేసి, ఇక్కడే ఉండండి. 1074 01:34:56,154 --> 01:34:57,823 ఇప్పుడు మీరు కూడా మాలో ఒకరు. 1075 01:35:04,913 --> 01:35:07,749 నాన్నా, ఇప్పుడు నువ్వు మా సమూహంలోకి చేరిపోయావు. 1076 01:35:41,658 --> 01:35:43,076 అంతా బాగానే ఉంది, బంగారం. 1077 01:35:43,160 --> 01:35:44,703 అంతా బాగానే ఉంది, నాన్నా. 1078 01:35:53,420 --> 01:35:54,963 రా! 1079 01:35:57,382 --> 01:35:59,134 ఇద్దరం పోటీ పెట్టుకుందాం! 1080 01:36:00,719 --> 01:36:02,638 తోడేలు, తోడేలు 1081 01:36:02,721 --> 01:36:04,556 తోడేలు ఊళపెడుతుంది 1082 01:36:04,640 --> 01:36:08,227 తోడేలు, స్వేచ్ఛగా పరిగెత్తు 1083 01:36:08,310 --> 01:36:10,103 తోడేలు, తోడేలు 1084 01:36:10,187 --> 01:36:12,231 తోడేలు ఊళపెడుతుంది 1085 01:36:12,314 --> 01:36:14,816 స్వేచ్ఛగా పరిగెత్తు 1086 01:36:15,484 --> 01:36:18,362 స్వేచ్ఛగా పరిగెత్తు 1087 01:36:19,863 --> 01:36:23,075 స్వేచ్ఛగా పరిగెత్తు 1088 01:36:23,534 --> 01:36:25,118 తోడేలు, తోడేలు 1089 01:36:25,202 --> 01:36:27,246 తోడేలు ఊళపెడుతుంది 1090 01:36:27,329 --> 01:36:30,666 తోడేలు, స్వేచ్ఛగా పరిగెత్తు 1091 01:36:31,124 --> 01:36:32,376 తోడేలు, తోడేలు 1092 01:36:38,173 --> 01:36:41,844 స్వేచ్ఛగా పరిగెత్తు 1093 01:36:45,889 --> 01:36:49,768 తెల్లవారక ముందే తోడేలు బయటకు వెళ్తుంది 1094 01:36:49,852 --> 01:36:53,438 సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేదాకా తోడేలు పరిగెడుతూనే ఉంటుంది 1095 01:36:53,522 --> 01:36:57,442 తోడేలు, మీ కలలలో మీకు దారి చూపుతుంది 1096 01:36:57,526 --> 01:36:59,570 స్వేచ్ఛగా పరిగెత్తు 1097 01:37:01,405 --> 01:37:03,073 తోడేలు, తోడేలు 1098 01:37:03,156 --> 01:37:04,908 తోడేలు ఊళపెడుతుంది 1099 01:37:04,992 --> 01:37:08,453 తోడేలు, స్వేచ్ఛగా పరిగెత్తు 1100 01:37:08,912 --> 01:37:10,706 తోడేలు, తోడేలు 1101 01:37:10,789 --> 01:37:12,666 తోడేలు ఊళపెడుతుంది 1102 01:37:12,749 --> 01:37:15,961 స్వేచ్ఛగా పరిగెత్తు 1103 01:37:16,044 --> 01:37:19,423 స్వేచ్ఛగా పరిగెత్తు 1104 01:37:20,257 --> 01:37:23,427 స్వేచ్ఛగా పరిగెత్తు 1105 01:37:24,052 --> 01:37:25,762 తోడేలు, తోడేలు 1106 01:37:25,846 --> 01:37:27,723 తోడేలు ఊళపెడుతుంది 1107 01:37:27,806 --> 01:37:31,059 తోడేలు, స్వేచ్ఛగా పరిగెత్తు 1108 01:37:31,602 --> 01:37:35,105 తోడేలు, తోడేలు ఊళపెడుతుంది 1109 01:37:35,189 --> 01:37:38,650 స్వేచ్ఛగా పరిగెత్తు 1110 01:37:38,734 --> 01:37:42,821 తోడేలు, తోడేలు ఊళపెడుతుంది తోడేలు, తోడేలు ఊళపెడుతుంది 1111 01:37:42,905 --> 01:37:46,200 స్వేచ్ఛగా పరిగెత్తు 1112 01:37:46,283 --> 01:37:49,453 స్వేచ్ఛగా పరిగెత్తు 1113 01:42:29,066 --> 01:42:31,068 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య